Pages

Subscribe

ప్రథమ స్కంధము 174 - 175

అధ్యాయము - ౮ (8)


వ. 174
ఇట్లుశ్వత్థామం బ్రాణావశిష్టుంజేసి వెడలనడచి పండవులు
పాంచాలీ సహితులై పుత్రులకు శోకించి మృతులైన
బంధువులకెల్ల దహనాది కృత్యంబులు జేసి జల ప్రదానంబు
సేయుకొఱకు స్త్రీలు ముందల నిడుకొని గోవిందుండునుం
దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి
హరిపాదపద్మజాత పవిత్రంబులైన భాగీరథీజలంబుల
స్నాతులై యున్నయెడం బుత్రశోకాతురులైన గంధారీ
ధృతరాష్టృలను, గుంతీ ద్రౌపదులను జూచి మాధవుండు
మునీంద్రులు దానునుం బంధుమరణ శోకాతురులైన వారల
వగవు మానిచి మన్నించె నివ్విధంబున.

శా. 175
పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులం
జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి
ప్పించె రాజ్యము ధర్మపుత్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁజే
యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబున.

0 comments: