Pages

Subscribe

ప్రథమ స్కంధము 134 - 139

అధ్యాయము - 7 (౭)


వ.134

మ.135
అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయము విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పించఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువన క్షేమంకరబైన భా
గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పఁగ.

వ.136
ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్ధియైన శుకునిచేఁ జదివించె నని చెప్పిన విని శౌనకుండు, నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె ననవుఁడు సూతుండిట్లనియె.

క.137
ధీరులు నిరపేక్షులు నా, త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు, నారాయణుఁ డట్టివాఁడు నవ్యచరిత్రా!

క. 138.
హరిగుణవర్ణన రతుఁడై హరితత్పరుడైన బాదరాయణి శుభ త
త్పరతం బఠించెఁ ద్రిజగ, ద్వరమంగళమైన భాగవత నిగమంబున్.

క.139.
నిగమములు వేయుఁ జదివిన, సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను, నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా!

0 comments: