Pages

Subscribe

ప్రథమ స్కంధము - 60-70

-: భగవంతుని యేకవింశత్యవతారములు :-


సీ.
మహదానందకార తన్మాత్ర సమ్యుక్తుడై చారుషొడశకళా సహితు(డగుచు(
బంచమహాభూత భాసితుండై శుద్ధసత్త్వుడై సర్వాతిశాయి యగుచు(
జరణోరుభుజముఖ శ్రవణాక్షినాసా శిరములు నానాసహస్రములు వెలు(గ
సంబరకేయూర హారకుండలికి రీటాదులు పెక్కువే లమరుచుండ(

తే.60.
బురుషరూపంబు ధరియించు పరు(డనంతు(, డఖిలభువనైక కర్తయై యలఘుగతిని
మానితాపార జలరాశిమధ్యమునను, యోగనిద్రావిలాసియై యొప్పచుండు.

వ.61.
మ.62.
సరసిం బాసిన వేయుకాలువల యోజన్ విష్ణునందైన శ్రీ
కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ సమ్యమీంద్రులు మహర్షుల్ విష్ణునంశంసముల్
హరి కృష్ణుండు బలానుజన్మ( డెడలె దావిష్ణు(డా నేర్పడన్.

క.63.
భగవంతుడు విష్ణువు, జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్
దగనవ్వెళల దయతో, యుగయుగమున( బుట్టి కాచునుద్యల్లీలన్.

ఆ.64.
అతిరహస్యమైన హరిజన్మకథనంబు, మనుజు(డెవ్వ(డేని మాపురేపు(
జాలభక్తితోడ( జదివిన సంసార, దుఃఖరాశి( బాసి తొలగిపోవు.

వ.65.

చ.66.
జననములేక కర్మముజాడల(బోక సమస్తచిత్త వ
ర్తను(డగు చక్రికిన్ గవు లుదారపదంబుల జన్మకర్మముల్
వినుతుల్ సేయుచుండుదురు వేదరహస్యములందు నెందు(జూ
చిన మఱిలేవు జీవునికి(జెప్పినకైవడి జన్మకర్మముల్.

మ.67.
భువనశ్రేణి నమోఘలీలు(డగుచున్ బుట్టించు రక్షించు నం
తవిధింజేయు మునుంగ(డందు బహుభూతవ్రాతమందాత్మతం
త్ర విహారస్థితు(డై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్
దివిభంగింగొను( జిక్క(డింద్రియములన్ ద్రిప్పున్ నిబంధించుచున్.

చ.68.
జగదధినాథు(డైన హరి సంతతలీలలు నామరూపముల్
దగిలి మనోవచోగతుల( దార్కికచాతురి యెంతగల్గినన్
మిగిలి కుతుర్కవాది దగ మేరలుచేసి యెఱుంగనేర్చునే
యగణిత నర్తక్రమము నజ్ఞు(డెఱింగి నుతింపనోపునే.

ఉ.69.
ఇంచుక మాయలేక మది నెప్పుడు వాయని భక్తితోడ వ
ర్తించుచు నెవ్వడేని హరి దివ్యపదాంబుజ గంధరాశి సే
వించు నతం డెఱుంగు నరవిందభవాదులకైన దుర్లభో
దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్.

మ.70.
హరిపాదద్వయభక్తి మీవలన నిట్ల్లరూఢమై యుండునే
తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్
ధరణీదేవతలార! మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్
హరిచింతన్ మిము(జెంద వెన్న(డును జన్మాంతర్వ్యథాయోగముల్.

ప్రథమ స్కంధము 52 - 59

-:సూతుండు నారయణ కథా ప్రశంస చేయుట:-
వ.52.
అని యిట్లు మహనీయ గుణగరిష్ఠులయిన
శౌనకాదిమునిశ్రేష్ఠులడిగిన రోమమహర్షణ
పుత్రుండై యుగ్రశ్రవసుండను పేరనొప్పి
నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుందైన సూతుండు.

మ.53.
సము(డై యెవ్వ(డు ముక్తకర్మచయుడై సన్న్యాసియై యెంటి(బో
వ మహాభీతి నొహొకుమార యనుచున్ వ్యాసుండు సీరంగ వృ
క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కంజేసె మున్నట్టిభూ
తమయున్ మ్రొక్కెద బాదరాయణి( దపోధన్యాగ్రణిన్ ధీమణిన్.

సీ.
కార్యవర్గంబును గారణసంగంబు నధికరించి చరించు నాత్మతత్త్వ
మధ్యాత్మ మనుబడు నట్టి యధ్యాత్మము( దెలివి సేయగ(జాలు దీపమగుచు
సకలవేదములకు సారంశమై యసాధారణమగు ప్రభావ
రాజకంబైన పురాణమర్మంబును గాఢసంసారాంధకారపటిలి

తే.54.
దాటగోరెడి వారికి దయదలిర్పనే తపొనిధి వివరించె నేర్పడంగ
నట్టి శుకనామధేయు మహాత్మగేయు విమలవిజ్ఞాన రమణీయ వేడ్క్(గొలుతు.

క.55.
నారయణకు నరునకు, భారతికిని మ్రొక్కి వ్యాసు పదములకు సమ
స్కారము సేసి వచింతు ను, దారగ్రంథంబు దళితతనుబంధంబున్.

వచనము.56.

క.57.
గురుమతులు దపసు లంతః, కరణంబులు శుద్ధి సేయు ఘనతరభక్తిన్
హరియందు సమర్పింతురు, పరమానందమున భిన్నభవబంధనులై.

తరల.58.
పరమపూరుషు(డొక్క(డాద్యుడు పాలనోద్భవ నాశముల్
సొరిది(జేయు ముకుంద పద్మజశూలిసం జ్ఞల( బ్రాకృత
స్ఫురిత సత్వరజస్తమంబుల( బొందు నందు శుభస్థితుల్
హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్వనిరూఢు(డై.

వ.59

ప్రథమ స్కంధము 38 - 51

శౌనకాది ఋషుల ప్రశ్న

కం.38
ఆ తాపసు లిట్లనిరి వి, నీతున్ విజ్ఞానఫణితనిఖిల పురాణ
వ్రాతున్ నుతహరిగుణ సం, ఘాతున్ సూతున్ నితాంతకరుణోపేతున్.

మ.39
సమతం దొల్లి పురాణపంక్తు లితిహాసశ్రేణులుం ధర్మశా
స్త్రములున్ నీవు పఠించి చెప్పితివి వేదవ్యాస ముఖ్యుల్, మునుల్,
సుమతుల్ సూచిన వెన్ని యన్నియును దో(చున్ నీమదిన్, దత్ప్రసా
దమునం జేసి యొ`రంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా!

క.40.
గురువులు ప్రియశిష్యులకుం, బరమరహస్యములు దెలియ(బలుకదు రచల
స్థిరకల్యాణం బెయ్యది, పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.

క.41.
మన్నా(డవు చిరకాలము, గన్న(డవు పెక్కులైన గ్రందార్ధంబుల్
విన్న(డవు విన(దగినవు, యున్న(డవు పెద్దలొద్దనుత్తమగోష్ఠిన్.

చ.42.
అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం
కలితులు మందభాగ్యులు సుకర్మములెయ్యవి సేయ(జాలరీ
కలియుగమనందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే.

సీ.
ఎవ్వని యవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది(జేయు
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ సంసారబంధంబు సమసిపోవు
నెవ్వని చరితంబు హౄదయంబు( జేర్చిన భయమొంది మృత్యువు పరువువెట్టు
నెవ్వని పదనది నేపారుజలములు సేవింప నైర్మల్యసిద్ధి గలుగు(

తే.43.
దపసు లెవ్వనిపాదంబు దగిలి శంతి, తెఱ(గు గాంచిరి వసుదేవదేవకులకు
నెవ్వ( డుదయించె( దత్కథలెల్ల విన(గ, నిచ్చపుట్టెడు నెఱి(గింపు మిద్ధచరిత.

క.44.
భూషణములు వాణికి నఘ, పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తొషణములు గల్యాణ వి, శేషణములు హరిగుణోపచితభాషణముల్.

క.45.
కలిదోష నివారకమై, యలఘు యశుల్ వొగడునట్టి హరికధనము ని
ర్మలగతి( గోరెడు పురుషు(డు, వెలయ(గ నెవ్వా(డు దగిలి విన(డు మహత్మా!

ఆ.46.
అనఘ విను రసజ్ఞులై వినువారికి, మాటమాట కధికమధురమైన
యట్టి కృష్ణుకథన మాకర్ణనముసేయు, దల(పుగలదు మాకు( దనివిలేదు.

మ.47.
పరగోవింద కథాసుధారస మహావర్షోరుధారా పరం
పరలంగాక బుధేంద్రచంద్ర! యితరోపాయాసురక్తిం బ్రవి
స్తర దుర్దాంతదురంత దుస్సహజనుస్సంభావితానేక దు
స్తర గంభీరకఠొరకల్మష కనద్దవానలం బాఱునే.

సీ.
హరినామకధన దావానల జ్వాలల( గాలవే ఘోరాఘ కాననములు
వైకుంథదర్శన వాయుసంఘంబుచె( దొల(గవే బహుదుఃఖ తోయదములు
కమలనాభధ్యాన కంఠీరవంబుచే( గూలవే సంతాప కుంజరములు
నారయణస్మరణ ప్రభాకరదీప్తి( దీఱవె షడ్వర్గ తిమిరతతులు

ఆ.48.
నళిననయన భక్తి నావచేగాక సం, సార జలధిదాటి చనగరాదు
వేయునేల మాకు విష్నుప్రభావంబు, దెలుపవయ్య సూత! ధీసమేత!

వ.49.
మఱియు కపటమానవండును గూఢుండునైన మాధవుండు రామసహితుండై యతిమానుషంబులైన పరాక్రమంబులు సేసెనట! వాని వివరింపుము. కలియుగంబు రాగలదని వైష్ణవక్షేత్రంబున దీర్ఘ సత్రనిమిత్తంబున హరికథలు విననెడగలిగి నిలిచితిమి. దైవయొగంబున

క.50.
జలరాశి దాటగోరెడి, కలము జనుల్ గర్ణధారు(గాంచిన భంగిన్
గలిదోష హరణవాంఛా, కలితులమగు మేము నిన్నుగంటిమి సూతా!

క.51.
చారుతరధర్మరాశికి, భారకుడగు కృష్ణుడాత్మపదమునకేగన్
ధారకుడు లేక యెవ్వని, జేరెను ధర్మంబు బలుపుసెడి మునినాథా!

ప్రథమ స్కంధము 36 - 37


నైమిశారణ్య వర్ణనము




కం.36.
పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమఫలనికాయోత్థిత సా
ద్గుణ్యమయి నైమిశాఖ్యారణ్యంబు నుతింప(దగు సరణ్యంబులలోన్.

వ.37.

నైమిశారణ్య వర్ణనము



ప్రథమ స్కంధము 32 - 35

సీ.32.
విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వనివలన నేర్పడు ననువర్తమున
వ్యావర్తనమున( గార్యములం దభిజ్ఞు(డై తాన రాజగుచు( జిత్తమున( జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వ(డు బుధులు మోహింతు రెవ్వ
నికి నెండమావుల నీట( గాచాదుల నన్యోన్యబుధ్ధి దా నడరునట్లు
ఆ.
త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము, భంగి( దో(చు స్వప్రభానిరస్త
కుహకు( డెవ్వ( డతని(గోరి చింతించెద, ననఘు విశ్వమయుని ననుదినంబు.

వ. 33.
ఇట్లు "సత్యం పరం ధీమహి" యను గాయత్రీ ప్రారంభున గయత్రీనామ బ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నదికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందు( జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబున నొప్పుచుండు.

సీ.34.

శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ
విన(గోరువారల విములచిత్తంబుల( జెచ్చెర నీశుండు చిక్కు( గాక
యితర శాస్త్రంబుల నీశండు చిక్కునె మంచివారలకు నిర్మత్సరులకు
గపటనిర్ముక్తులై కాంక్ష సేయక యిందు( దగిలియుందుట మహాతత్వబుధ్ధి.

తే.
పర(గ నాధ్యాత్మికాది తాపత్రయంబు, నడ(చి పరమార్ధభూతమై యఖిల సుఖద
మైసమస్తంబుగాకయు నయ్యునుండు, వస్తువెఱుగంగ( దగుభాగవతమునందు.

ఆ.35.
వేదకల్పవృక్షవిగళితమై శుక, ముఖసుధాద్రావమున మొనసియున్న
భాగవతపురాణ ఫలరసాస్వాదన, పదవి( గనుడు రసిక భావవిదులు.

ఛందస్సు


సీ: సీసము

తే: తేటగీతి

కం: కందము

: ఉత్పల మాల

: చంపక మాల

: మత్తేభము

శా: శార్దూలము

: వచనము

ఆ: ఆటవెలది


ప్రథమ స్కంధము 27 - 30



"షష్ట్యంకములు"

ఉ.27.

హారికి నందగోకుల విహారికి జక్రసమీరదైత్య సం

హారికి భక్త దుఃఖపరిహారికి గోపనితంబినీ మనో

హారికి దుష్టసంప దపహారికి ఘోషకుటీపయోఘృతా

హారికి బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్.

ఉ.28.

శీలికి నీతిశాలికి వశీకృతశూలికి బాణహస్తిని

ర్మూలికి ఘోరనీరదవిముక్తశిలాహత గోపగోపికా

పాలికి వర్ణధర్మ పరిపాలికి నర్జునభీజయుగ్మ సం

చాలికి మాలికిన్ విపుల చక్రనిరుద్ర మరీచిమాలికిన్.

ఉ.29.

క్షుంతకు( గాళియోరగ విశాల ఫణోపరివర్తన క్రియా

రంతకు నుల్ల సన్మగధరాజ చతుర్విధఘోర వహినీ

హంతకు నింద్రనందననియంతకు సర్వచరాచరావళీ

మంతకు నిర్జితేంద్రియసమంచిత భక్తజనానుగంతకున్.

ఉ.30.

న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మన

స్థాయికి భూతసమ్మద విధాయికి సాధు జనానురాగ సం

ధాయికి( బీతవస్త్ర పరిధాయికి( బద్మభవాండ భాండ ని

ర్మాయికి గోపికానివహమందిరయాయికి శేషశాయికిన్.

వ.

సమర్పితంబుగా నే నంధ్రభషను రచయింపబూనిన
శ్రీమహాభాగవతంబునకుంబ్రారంభం బెట్టిదనిన.

ప్రథమ స్కంధము 22 - 26


"గ్రంధకర్తృ వంశవర్ణనము"

సీ. 22.


కౌండిన్యసగోత్ర సంకలితుఁడాపస్తంబసూత్రండు పుణ్యుండు సుభగుఁడైన
భీమన మంత్రికిఁబ్రియపుత్రుఁడన్నయ కలకంఠి తద్భార్య గౌరమాంబ
కమలాప్తు వరమునఁగనిన సోమనమంత్రి వల్లభ మల్లమ వారి తనయు
డెల్లిన యతనికి నిల్లాలు మాచమ వారి పుత్రుఁడు వంశ వర్ధనుండు

ఆ.

లలిత మూర్తి బహుకళానిధి కేసన, దానమాననీతిధను(డు ఘనుడు
తనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ, మనియె శైవశాస్త్రమతము గనియె.

క.23.

నడవదు నిలయము వెలువడి, తడవదు పర పురుషు గుణము దనపతి నొడుపున్
గడవదు వితరణ కరుణలు, విడువదు లక్కంబ విబుధ విసరమువొగడన్.

ఉ.24
మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి దానధర్మ మతిగౌరవ మంజులతాభీరతా
స్థానికి ముద్దసానికి సదాశివపాదయుగార్చనానుకం
పానయ వాగ్భవానికిని బమ్మెర కేసయ లక్కసానికిన్.

క.25.
ఆమానిని కుదయించితి, మేమిరపుర మగ్రజాతుఁడీశ్వర సేవా
కాముఁడు తిప్పయ; పోతయ నామవ్యక్తుండ సాధునయయుక్తుండన్.
వ.26.

అయిన నేను నా చిత్తంబున( బెన్నిధానంబునుం బోని శ్రీరామచంద్రుసన్నిధానంబుఁగల్పించుకొని.

ప్రధమ స్కంధము 16 - 21

క.16.

పలికెడిది భాగవతమ(ట, పలికించువిభుండు రామభద్రుండ(ట నే(
బలికిన భవహరమగున(ట, పలికెద వేఱొండుగాథ( బలుక(గ నేలా.

Get this widget Track details eSnips Social DNA

ఈ పద్యము వినుటకు ఈ అక్షరములపైన క్లిక్ చేయగలరు

ఆ.17.
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన( దమ్మిచూలికైన
విబుధ జనులవలన విన్నంత కన్నంత, తెలియ వచ్చినంత తేటపఱుతు.

Get this widget Track details eSnips Social DNA


Get this widget Track details eSnips Social DNA


క.18.
కొందఱికి(దెను(గు గుణమగు(, గొందఱికిని సంస్కృతంబుగుణమగు రెండున్
గొందఱికి గుణములగు నే, నందఱి మెప్పింతు( గృతుల నయ్యైయెడలన్.
మ.19.
ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురణావళుల్
తెను(గుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెను(గుం జేయరు మున్న భాగవతమున్ దీనిన్ దెనింగించి నా
జననంబున్ సఫలంబు చెసెద( బునర్జన్మంబు లేకుండ(గన్.
మ.20.
లలితస్కంధము గృష్ణమూలము శూకాలపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్విజశ్రేయమై.

Get this widget Track details eSnips Social DNA

ఈ పద్యము వినుటకు ఈ అక్షరములపైన క్లిక్ చేయగలరు

వ.21.
ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవతపురాణ పారిజాతపాదప సమాశ్రయంబున హరి కరుణావిశేషంబున( గృతార్ధత్వంబు సిధించెనని బుధ్ధినెఱింగి లేచి మరలి కొన్ని దినంబులను నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురువృధ్ధబుధ బంధు జనానుజ్ఞాతుండనై.

ప్రధమ స్కంధము 11 - 15

ఉ.11
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు( గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము( బాసి కాలుచె
సమ్మెట వాటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జోక(డు భాగవతంబు జగధ్ధితంబుగన్.
నోరునొవ్వంగ హరికీర్తి నుడువ(డేని
దయయు సత్యంబులోను గా(దల(ప(డేని,
గలుగనేతికి( దల్లులకడుపుచేటు.


Get this widget Track details eSnips Social DNA

వ.13.

అని మదీయ పూర్వజన్మసహస్రసంచితతపః ఫలంబున శ్రీమన్నారాయణ కధా ప్రపంచ విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబురాక( గని సజ్జనానుమతంబున నభ్రంకషశుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుం జని క్రుంకులిడి వెడలి మహనీయమంజుల పులినతలమందప మధ్యంబున మహెశ్వర ధ్యానంబు సేయుచు( గించిదున్మీలుత లోచనుండనై యున్నయెడ.

సీ.14.


మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండ నొప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున( జిఱునవ్వు మొలచువాడు
వల్లీయుతతమాల వసుమతీజము భంగి బలు విల్లు మూ(పున( బర(గువా(డు
నీలనగాగ్ర సన్నిహితభానుని భంగి ఘనకిరీటము దల( గల్గువా(డు

Get this widget Track details eSnips Social DNA

ఆ.
పుండరీక యుగము(బోలు కన్నులవా(డు,

వెడ(ద యురమువా(డు విపులభద్ర
ముర్తి వా(డు రాజముఖ్యు(డోక్కరు(డునా,

కన్ను(గవకు నెదుర(గానబడియె.


Get this widget Track details eSnips Social DNA

వ. 15.

ఏ నా రాజశేఖరునిం దేఱిచూచి భాషింప యత్నంబు సేయునెడ
నతండు దా రామభద్రుండ మన్నమంకితాంబుగ
శ్రీ మహాభాగవతంబు( దెనుంగు సేయుము నీకు
భవబంధములు దెగునని యానతిచి తిరోహితుండయ్యె.
అంత నే సమున్మీలిత నయనుండనై వెఱగు పడి చిత్తంబున.

ప్రథమ స్కంధము 1-10

1.
శ్రీ కైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లొకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలొలవిలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహనందాంగనాడింభకున్.

...

2.
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికి దయా
శాలికి శూలికి శిఖరిజాముఖపద్మ మయూఖమాలికి
బాలశశాంకమౌలికిఁ గపాలికి మన్మధ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహాళికి

ఉ. 3.
అతత సేవ సేసెద సమస్తచరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీహౄదయసౌఖ్యవిధాతకు వేదరాసి ని
ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకు నత
త్రాతకు ధాతకు నిఖిలతాపసలోక సుభప్రదాతకు.

వ. 4.
అని నిఖిల ప్రధానదెవతావందనంబు సేసి 

ఉ. 5.
ఆదరమొప్ప మ్రొక్కిడిదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికిఁ బ్రపన్న వినోదికి విఘ్నవల్లికా
ఛ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందవెదికి
మోదకఖాదికి సమదమూషకసాదికి సుప్రసాదికి.

ఉ. 6.
క్షోనితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కినుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షితానత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికి
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.

శా. 7.
పుట్టం బుట్ట శరంబున మొలవ నంభొయానపాత్రంబున

నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింప దొరంకొంటి మీఁ
దెట్టే వెంతఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యో యమ్మ మేల్
పట్టు న్మానకుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ.

ఉ. 8.
అమ్మలఁగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

మ. 9.
హరికిన్ బట్టపు దేవి పున్నెములప్రోవర్ధంభు పెన్నిక్క చం
దురు తోఁ బుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూఁబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురత లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్యకళ్యాణముల్.

వ. 10.
అని ఇష్టదెవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి ప్రధమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతయించి హయగ్రీవ దనుజకర పరిమిళిత నిగమనివహవిభాగ నిర్ణయనిపుణతాసముల్లాసుండగు వ్యాసునకు మ్రొక్కి శ్రీమహాభాగవతకధా సుధారసప్రయోగికి శుకయోగికి నమస్కరించి మృదుమధుర వచనరచన పల్లవితస్ధాణునకున్ బాణునకుం బ్రణమిల్లి కతిపయశ్లోకసమ్మోదితసూరు మయూరు నభినందించి మహాకావ్య కరణకళావిలాసుం గాళిదాసుంగొనియాడి కవికమల విసరరవిం భారవిం బొగడి విదళితాఘు మాఘు స్తుతియించి యాంధ్రకవితాగౌరవజనమనోహరి నన్నయ సూరిం గైవారంబుసేసి హరిహర చరణారవిందవందనాభిలాషిఁ దిక్కన మనీషిన్ భూషించి భక్తివిశేషిత పరమెశ్వరుండగు ప్రబంధపరమెశ్వరుం బ్రణుతించి మఱియు నితర పూర్వకవి జనసంభావనంబు గావించి వర్తమాన కవులకుం బ్రియంబు వలికి భావికవుల బహూకరించి యుభయకావ్యకరణదక్షుండనై.


మునుపటి                                       తదుపరి

ముందుమాట





పలికెడిది భాగవతమఁట, పలికించువిభుండు రామభద్రుండఁట నేఁ
బలికిన భవహరమగునఁట, పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా.


తాత్పర్యము: 
వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను


మునుపటి                                                          తదుపరి

ప్రార్ధన




శుక్లాం భరధరం విష్నుం శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే


తదుపరి