Pages

Subscribe

ప్రథమ స్కంధము 203 - 216

అధ్యాయము - ౯ (9)

క. 203
అని ఇట్లు ధర్మసూనుఁడు, మొనసి నిరాహారభావమున దేవనదీ
తనయుడుఁ గూలినచోటికిఁ, జనియెఁ బ్రజాద్రోహ పాపచలితాత్ముండై


-: ధర్మరాజు శ్రీకృష్ణసహితుండై శరకల్పగతుండగు భీష్మునికడ కేగుట  :-

వ. 204
అ య్యవసరంబునం దక్కిన పాండవులును, ఫల్గునసహితుండైన పద్మలోచనుండును, కాంచన సమంచితంబులైన రథంబులెక్కి ధర్మజుంగూడిచన, నతండుగుహ్యక సహితుండైన కుబేరునిభంగి నొప్పె. ఇట్లు పాండవులు పరిజనులు గొలువఁ బద్మనాభ సహితులై కురుక్షేత్రంబున కేగి, దివంబునుండి నేలం గూలిన దేవత తెఱంగున సంగ్రామ పతితుండైన గంగానందనునకు నమస్కరించిరి. అంత బృహదశ్వ భరద్వాజ పరశురామ గౌతమ పర్వత నారద బాదరాయణ కశ్యపాంగిరస కౌశిక ధౌమ్య సుదర్శన శుక వసిష్ఠా ద్యనేక రాజర్షి బ్రహ్మర్షులు శిష్యసమేతులై చనుదెంచినం జూచి సంతసించి దేశ కాల విభాగవేదియైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి.

క. 205
మాయాంగీకృత దేహుం, డై యఖిలేశ్వరుఁడు మనుజుఁ డై నాఁడని ప్ర
జ్ఞాయత చిత్తంబున గాం, గేయుఁడు పూజనము సేసెఁగృష్ణున్ జిష్ణున్.

వ. 206
మఱియుం గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండునందనులంగూర్చుండ నియోగించి, మహానురాగ జనిత బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె.

ఆ. 207
ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగాఁ, బ్రతుకఁదలఁచి మీరు బహువిధముల
నన్నలార! పడితి రాపత్పరంపర, లిట్టి చిత్రకర్మ మెందుఁగలదె!

ఉ. 208
సంతస మింత లేదు మృగశాప వశంబునఁ బాండు భూవిభుం
డంతము వొంది యుండ మిము నర్భకులం గొనివచ్చి కాంక్షతో
నింతటి వారిఁగా బెనిచె నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ
కుంతి యనేక దుఃఖములఁ గుందుచు నున్నది భాగ్యమెట్టిదో!

ఉ. 209
దాయు వశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాంతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచునుండుఁ గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.

ఉ. 210
రాజఁట ధర్మజుండు సురరాజ సుతుండఁట ధ్వని శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లఁట సారథి సర్వభద్ర సం
యోజకుఁడైన చక్రి యఁట యుగ్ర గదాధరుఁడైన భీముఁడ
య్యాజికిఁ దోడు వచ్చునఁట యాపద గల్గుట యేమిచోద్యమో!

ఆ. 211
ఈశ్వరుండు విష్ణుఁడెవ్వేళ నెవ్వని, నేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు?
నతని మాయలకు మహాత్ములు విద్వాంసు, లణఁగి మెలఁగుచుందు రందులగుచు.

వ.212
కావున దైవతంత్రం బైన పనికి వగవం బినిలేదు. రక్షకులు లేని ప్రజలు నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారయణుండు తేజోనిరూఢుండు గాక, యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబులం మోహతిరేకంబు నొందించును. అతని రహస్యప్రకారంబులు భగవంతుండైన శివుం డెఱుంగు. మఱియు దేవర్షియగు నారదుండును, భగవంతుడగు కపిల మునియు నెఱుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీపుత్రుండని మాతులేయుండని తలంచి దూత సచివ సారథి బంధు మిత్రప్రయోజనంబుల నియమించుదు రిన్నిటంగొఱంతలేదు. రాగాది శూన్యుండు, నిరహంకారుం, డద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండు నైన యీశ్వరునకున్నతోన్నతభావ మతివైషమ్యంబులెక్కడివి? లేవు? ఆయన భక్తవత్సలుండు గావున, నేకాంత భక్తులకు సులభుండై యుండు.

సీ.
అతిభక్తి నెవ్వనియందుఁ జిత్తము జేర్చి యెవ్వనినామ మూహించి పొగడి
కాయంబు విడుచుచుఁ గామ కర్మాది నిర్మూలనుండై యోగి ముక్తినొందు
నట్టి సర్వేశ్వరుం డఖిల దేవోత్తంసుఁ డెవ్వెళఁ బ్రాణంభు లేను విడుతు
నందాఁక నిదె మందహాసుఁడై వికసిత వదనారవిందుఁడై వచ్చి నేఁడు

తే. 213
నాల్గుభుజములుఁ గమలాభనయనయుగము, నొప్పఁగన్నుల ముందట నున్నవాఁడు
మానవేశ్వర నా భాగ్యమహిమఁజూడు, మేమి సేసితినో పుణ్యమితనిఁగూర్చి!.

వ.214
అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుండైన కురుకుంజరుని వచనంబులు వినయంబున నాకర్ణించి మును లందఱు వినుచునుండ ధర్మనందనుండు మందాకినీనందనువలన (నరజాతి సాధారణబులగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును) రాగ వైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును, దాన ధర్మంబులును, హరితోషణంబులగు ధర్మంబులను, రాజధర్మంబులును, స్త్రీ ధర్మంబులును, శమ దమాదికంబులును, ధర్మార్ధ కామ మోక్షంబులును (నానా విధోపాఖ్యానేతిహాసంబులును) సంక్షేప విస్తార రూపంబుల నెఱింగె. అంత రధిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులకు వాంఛితంబగు నుత్తరాయణంబు చనుదెంచిన నది దనకు మరణోచిత కాలంబని నిశ్చయించి.

శా. 215
ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ
గ్జాలంబు హరిమోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టి విని
ర్మూలీభూత శరవ్యథా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరి.

వ. 216
ఇట్లు పరమేశ్వరుండైన హరియందు నిష్కాముండై ధారణావతియైన బుధ్ధిని సమర్పించి, పరమానందంబు నొంది, ప్రకృతి వలన నైన సృష్టిపరంపరలఁ బరిహరినంచు తలంపున మందాకినీనందనుం డిట్లనియె.

ప్రథమ స్కంధము 185 - 202

* * *
కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట
* * *
క. 185
పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ, బరుఁ డవ్యయుఁ డఖిల భూత బహిరంత ర్భా
సురుఁడు నవలోకనీయుఁడు, పరమెశ్వరుఁడైన నీకు బ్రణుతులగు హరీ!

వ. 186
మఱియు జవనిక మఱవున నాట్యంబు సలుపు నటుని చందంబున, మాయాజవని
కాంతరాళంబున నిలువంబడి, మహిమచేఁ బరమహంసలుఁ, నివృత్తరాగద్వేషులు,
నిర్మలాత్ములునైన ముబులకు నదృశ్యమానుండవై, పరిచ్ఛినుండవు గాని నీవు
మూఢదృక్కులు, గుటుంబవతులు నగు మాకు నెట్లు దర్శనీయుండవయ్యెదు?
శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ!
పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశచరణ! హృశీకేశ!
భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము.

సీ.
తనయుల తోడనే దహ్యమానంబగు, జతుగృహంబందును జావకుండఁ
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల మారుతపుత్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ ద్రౌపదిమానంబు దలఁగకుండ
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డ లనిలోన నలఁగకుండ

తే. 187
విరటుపుత్రిక కడుపులో వెలయు చూలు, ద్రోణనందన శరవహ్నిఁ ద్రుంగకుండ
మఱియు రక్షించితివి పెక్కుమార్గములను, నిన్నునేమని వర్ణింతు నీరజాక్ష! 

మత్తకోకిల. 188
బల్లిదుండగు కంసుచేతను బాధ నొందుచునున్న మీ
తల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రులచేత నేఁ
దల్లడంబునఁ జిక్కకుండఁగ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన జగత్పతీ!

క. 189
జననము నైశ్వర్యంబును, ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం
చన గోచరుఁడగు నిన్నున్, వినుతింపఁగ లేరు నిఖిల విభుధస్తుత్యా!

వ. 190
మఱియు భక్తధనుండును, నివృత్త ధర్మార్ధ కామ విషయుండును,
ఆత్మారాముండును, రాగాది రహితుండును, కైవల్యదాన సమర్ధుండును,
కాలరూపకుండును, నియామకుండును, నాద్యంత శూన్యుండును,
విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహకరుండునైన
నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము.మనుష్యుల విడంబించు
భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు? నీకు బ్రియాప్రియులు
లేరు; జన్మ కర్మ శూన్యుండవైన నీవు తిర్య గాది జీవులయందు వరాహాది
రూపంబులను జలచరంబులయందు మత్స్యాదిరూపంబులను, నవతరించుట
లోకవిడంబనార్థంబు గాని, జన్మ కర్మ సహితుండ వగుటం గాదు.

ఉ. 191
కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్ప తోయధా
రా పరిపూర్ణ వక్త్రము గరంబులఁ బ్రాముచు వెచ్చ నూర్చుచుం
బాపఁడవై నటించుట గృపాపర! నా మదిఁ జోద్యమయ్యెడిన్.

క. 192
మలయమునఁ జందనము క్రియ, వెలయఁగ ధర్మజునికీర్తి వెలయించుటకై
యిలపై నభవుఁడు హరియదు, కులమున నుదయించె నండ్రు గొంద ఱనంతా!

క. 193
వసుదేవ దేవకులు దా, పసగతి గతభవమునందుఁ బ్రార్థించిన సం
తసమునఁ బుత్రత నొందితి, వసురుల మృతికంచుఁ గొంద ఱండ్రు మహాత్మా!

క. 194
జలరాశిలో మునింగెడి, కలముక్రియన్ భూరిభార కర్శిత యగు నీ
యిలఁ గావ నజుఁడు గోరినఁ గలిగితి వని కొంద ఱండ్రు గణనాతీతా!

తే. 195
మఱచి యజ్ఞాన కామ కర్మముటఁ దిరుగు, వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ
శ్రవణచింతన వందనార్చనములిచ్చు, కొఱకు నుదయించి తండ్రు నిన్ గొందఱభవ!

మ. 196
నినుఁ జింతింపుచుఁ బాడుచుం బొగుడుచు న్నీ దివ్య చారిత్రముల్
వినుచుం జూతురుగాక లోక లితరాన్వేషంబులం జూతురే?
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంభై మహాయోగి వా
గ్వినుతంబైన భవ త్పదాబ్జ యుగమున్ విశ్వేశ! విశ్వంభరా!

వ. 197
దేవా! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందముల నాశ్రయించి
నీ వారలమైన మమ్ము విడిచి విచ్చేయనేల? నీ సకరుణావలోకసంబుల
నిత్యంబును జూడవేని యాదవ సహితులైన పాండవుల జీవునిం
బాసిన యింద్రియంబుల చందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు
నొందుదురు. కల్యాణలక్షణ లక్షితంబులైన నీ యడుగులచేత నంకితంబైన
యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబు గాదు. నీ కృపా
వీక్షణామృతంబున నిక్కడి జనపదంబుల గుసుమ ఫలబరితంబులు,
నోషధి తరు లతా గుల్మ నద నదీ నగ సాగర సమేతంబులునై యుండు.

ఉ. 198
యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియు నట్లుగఁ జేయఁగదయ్య! యీశ్వరా!

శా. 199
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానెధీ!

వ. 200
అని యిట్లు సకల సంభాషణంబుల నుతియించు గొంతి మాటలకు
నియ్యకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున
మోహంబు నొందించి, రథారూఢుండై కరినగరంబునకు వచ్చి, కుంతీ
సుభద్రాదులన్ వీడ్కొని, తన పురంబునకు విచ్చేయ గమకించి, ధర్మరాజుచేఁ
గించిత్కాలంబు నిలువుమని ప్రార్థితుండై నిలిచె. అంత బంధువధ
శోకాతురుండైన ధర్మజుఁడు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేతఁ
దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకంబున నిట్లనియె.

మ. 201
తన దేహంబునకై యనేక మృగసంతానంబుఁ జంపించు దు
ర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృసంఘంబు ని
ట్లనిఁ జంపించిన పాపకర్మనకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా
యన లక్ష్యావధినైన ఘోర నరక వ్యాసంగము ల్మానునే?

వ. 202
మఱియుఁ బ్రజా పరిపాలన పరుండైన రాజు ధర్మయుధ్ధంబున
శత్రువుల వధియించినఁ బాపంబు లేదని శాస్త్రవచనంబు గలదు.
అయిన నది విజ్ఞానంబు కొఱకు సమర్ధంబు గాదు. చతురంగంబుల
ననే కొక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి. హతబంధులైన
సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు.
గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగమేధాది యాగంబులచేతం
బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబులవలన విడివడి
నిర్మలలుండగునని నిగమంబులు నిగమించు. పంకంబునఁ
బంకిలస్థలఁబునకును, మద్యంబున మద్య భాండమునకును
శుధ్ధి సంభవింపని చందంబున, బుధ్ధిపూర్వక జీవహింసనంబు
లైన యాగంబుల చేతం బురుషులకుఁ బాపబాహుళ్యంబ
కాని పాపనిర్ముక్తి గాదని శంకించెద.

ప్రథమ స్కంధము 176 - 184

* * *
శ్రీకృష్ణుడుత్తరా గర్భస్థుండగు పరీక్షితునిఁ దన చక్రంబుచే రక్షించుట
* * *

వ. 176
అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసురపూజితుండై, యుద్ధవ సాత్యకులు గొలువ, ద్వారకాగమున ప్రయత్నంబునఁ బాండవుల వీడ్కొని, రథారోహణఁబు సేయు సమయంబునఁ దత్తరపడుచు నుత్తర సనుదెంచి కల్యాణగుణోత్తరుండైన హరి కిట్లనియె.

మ. 177
ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ
డుదరాంతర్గత గర్భదాహమునకై యుగ్రాకృతిన్ వచ్చుచు
న్నది దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియు లేదు నీ
పదపద్మంబులె కాని యెం డెఱుఁగ నీ బాణాగ్ని వారింపవే.

క. 178
దుర్భర బాణానలమున, గర్భములో నున్న శిశువు ఘన సంతాపా
విర్భావంబును బొందెడి, నిర్భర కృపఁ గావుమయ్య! నిఖిలస్తుత్యా!

క. 179
చెల్లెలి కోడల నీ మే, నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం
పుల్లరవిందలోచన!, భల్లాగ్ని నణించి శిశువు బ్రతికింపఁగదే.

ఆ. 180
గర్భమందుఁ గమలగర్బాండ శతములు, నిముడుకొన నటించు నీశ్వరేశ!
నీకు నొక్క మానినీ గర్భరక్షణ, మెంత బరువు నిర్వహింతు గాక.

వ. 181
అనిన నాశ్రితవత్సలుండైన పరమేశ్వరుండు స్భద్రకోడలి దీనాలాపంబు
లవధరించి, యిది ద్రోణనందనుండు లోకమంతయు నపాండవంబయ్యెడు
నని యేసిన దివ్యాస్త్రమని యెఱింగె. అంతఁ బాండవుల కభిముఖంబై,
ద్రోణనందను దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబు డగ్గాఱిన బెగ్గడీలక,
వారును ప్రత్యస్త్రంబు లందుకొని పెనంగు సమయంబున

మ. 182
తన సేవారతిచింత గాని పరచింతా లేశము లేని స
జ్జనులం బాండుతనూజుల మనువు వాత్సల్యంబుతో ద్రోణనం
దను బ్రహ్మాస్త్రము నడ్డపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా
దన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.

మ. 183
సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ
క్ష్మకళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్రహ
స్తకుఁడై వైష్ణవమాయ గప్పి కురుసంతానార్ధియై యడ్డమై
ప్రకటస్ఫూర్తి నణించె ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్.

వ. 184
ఇట్లు ద్రోణతనయుం డేసిన ప్రతిక్రియా రహితంబైన, బ్రహ్మశిరం
బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్ధకం బయ్యె. నిజమాయా
విలసనమున సకల లోక సర్గస్థితి సంహారంబు లాచరించునట్టి
హరికి, ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబుగాదు.
తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాల పుత్రికా సహితమై
గొంతి, గమనోన్ముఖుండైన హరిం జేరవచ్చి యిట్లనియె.

ప్రథమ స్కంధము 174 - 175

అధ్యాయము - ౮ (8)


వ. 174
ఇట్లుశ్వత్థామం బ్రాణావశిష్టుంజేసి వెడలనడచి పండవులు
పాంచాలీ సహితులై పుత్రులకు శోకించి మృతులైన
బంధువులకెల్ల దహనాది కృత్యంబులు జేసి జల ప్రదానంబు
సేయుకొఱకు స్త్రీలు ముందల నిడుకొని గోవిందుండునుం
దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి
హరిపాదపద్మజాత పవిత్రంబులైన భాగీరథీజలంబుల
స్నాతులై యున్నయెడం బుత్రశోకాతురులైన గంధారీ
ధృతరాష్టృలను, గుంతీ ద్రౌపదులను జూచి మాధవుండు
మునీంద్రులు దానునుం బంధుమరణ శోకాతురులైన వారల
వగవు మానిచి మన్నించె నివ్విధంబున.

శా. 175
పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులం
జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి
ప్పించె రాజ్యము ధర్మపుత్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁజే
యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబున.

ప్రథమ స్కంధము 140 - 173

అర్జునుఁడు పుత్రఘాతియగు నశ్వత్థామను అవమానించుట


వ. 140
అని పలికి రాజర్షియైన బరీక్షిన్మహారాజు జన్మకర్మ ముక్తులును, పాండవుల
మహాప్రస్థానంబును, కృష్ణకథోదయంబును జెప్పెద. కౌరవదృష్టద్యుమ్నాదుల
యుద్ధంబున వీరులయినవారల స్వర్గంబునకుం జనిన వెనుక, భీము
గదాఘాతంబున దుర్యోధనుండు దొడలువిఱిగి కూలిన నశ్వత్థామ దుర్యోధనునకుం
బ్రియంబు సేయువాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి
సమర్పించె. అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు.

ఉ. 141
బాలురచావు కర్ణములఁబడ్డఁ గలంగి యలంగి యోరువం
జాలక బాష్పతోయకణజాలము చెక్కుల రాల నేడ్చి పాం
చాలతనూజ నేలఁబడి జాలిఁబడం గని యెత్తి మంజూవా
చాలతఁ జూపుచుం జికురజాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనెన్.

మ.142
ధరణీశాత్మజ వీవు నీకు వగవ ధర్మంబె? తద్ద్రౌణి ని
ష్కరుణుండై విదళించె బాలకుల, మద్గాండీవ నిర్ముక్త భీ
కర బాణంబుల నేఁడు వాని శిరము ఖండించి నేఁ దెత్తుఁ ద
చ్ఛిరము ద్రొక్కి జలంబులాడు మిచటన్ శీతాంశుబింబాననా.

వ.143
అని యెడంబఱచి తనకు మిత్రుండును సారథియు నైన
హరిమేలనుచుండం గవచంబు దొడిగి గాండీవంబు ధరియించి
కపిధ్వజుండై గురుసుతుని వెంటరథంబు దోలించిన.

శా. 144
తన్నుం జంపెదనంచు వచ్చు విజయుం దర్శించి తద్ద్రౌణి యా
పన్నుండై శిశుహంత గావున నిజప్రాణేచ్ఛఁ బాఱె వడి
ము న్నా బ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా
సన్నుండౌ హరుఁజూచి పాఱు పగిది సర్వెంద్రియ భ్రాంతితో.

వ.145
ఇట్లోపినంత దూరంబునుం బరువిడి వెనుకఁజూచి, రథతురంగంబు
లలయుట దెలిసి, నిలిచి ప్రాణరక్షణంబునకు నొండుపాయంబు లేదని
నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమహితచిత్తుండై,
ప్రయోగంబ కాని యుపసమ్హారంబు నేరకయుం బ్రాణ
సంరక్షణార్థంబునకై పార్థునిమీఁద బ్రహ్మశిరో నామకాస్త్రంబు ప్రయోగించిన
నది ప్రచండతేజంబున దిగంతరాళంబులు నిండి ప్రాణ భయంకరంబై
తోఁచిన హరికి నర్జునుండిట్లనియె.

సీ.
పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద! వినుము సంసారాగ్ని వేఁగుచున్న
జనుల సంసారంబు సంహరింపఁగ నీవుదక్క నన్యులులేరు తలఁచి చూడ
సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతిపరుండవు పరమపురుష!
నీ ప్రబోధముచేత నీ మాయ నంతయు నణఁతువు నిశ్శ్రేయ సాత్మయందు.

ఆ. 146
మాయయందు మునిఁగి మనువారలకుఁ గృపఁ, జేసి ధర్మముఖ్యచిహ్నమైన
శుభము సేయుచుందు సుజనుల నవనిలోఁ, గావఁబుట్టుదువు జగన్నివాస!

క. 147
ఇది యొక తేజము భూమియుఁ, జదలను దిక్కులును నిండి సర్వంకషమై
యెదురై వచ్చును నున్నది, విదితముగా నెఱుఁగ జెప్పవే దేవేశా!

వ. 148
అనిన హరి యిట్లనియె.

శా.149
జిహ్మత్వంబునఁ బాఱి ద్రోనజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛువై
బ్రహ్మాస్త్రం బదె యేయ వచ్చె నిదె తద్బాణాగ్ని బీభత్స! నీ
బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మరలింపన్ రాదు సంహార మీ
బ్రహ్మపత్య మెఱుంగఁ డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై.

వ.150
అనిన నర్జునుండు జలంబులు వార్చి హరికిం బ్రదక్షినంబు వచ్చి
ద్రోణనందనుండేసిన బ్రహ్మాస్త్రంబుమీఁదఁ దన బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన.

మ. 151
అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్
రవి వహ్ని ద్యుతిఁ బోరుచుం ద్రిభువన త్రాసంబు గావింపఁగా
వివశభ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వీక్షింప నీవేళ మా
ధవు నాజ్ఞ విజయిండు సేసె విశిఖద్వంద్వోపసంహారము.

వ. 152
ఇట్లస్త్రద్వయంబు నుపసంహరించిన ధనుంజయుండు
ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని రోషారుణిత
లోచనుండై యాజ్ఞికుండు రాజ్జవునం. బశువుంగట్టిన
చందంబున బంధించి శిబిరంబుకడకుం గొని చని
హింసింతునని తిగిచినం జూచి హరి యిట్లనియె.

ఉ. 153
మాఱు పడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్నపాపల వధించె నిశీథమునందుఁ గ్రూరుఁడై
పాఱుఁడె వీఁడు పాతకుఁడు ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం
బాఱెడి వీనిఁ గావకు కృపామతి నర్జున! పాపవర్జనా!

చ. 154
వెఱచినవాని దైన్యమున వేఁదుఱు నొందినవాని నిద్రమై
మఱచిన వాని సౌఖ్యముగ మద్యము ద్రావినవాని భగ్నుఁడై
పఱచినవాని సాధు జడభావము వానిని గావుమంచు వా
చఱచినవానిఁ గామినుల జంపుట ధర్మముగాదు ఫల్గునా!

శా. 155
స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ గరుణాసంగంబు చాలించి య
న్య ప్రాణంబులచేత రక్షణము సేయ వాఁడధోలోక దుః
ఖప్రాప్తుండగు రాజదండమున సత్కల్యాణుఁడౌ నైన నీ
విప్రుం దండితుఁజేయు మేటికి మహావిభ్రాంతితో నుండఁగ.

వ. 156
అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మనుండు
(గృతాపరాధుండయిన వధ్యుండు గాఁడను ధర్మంబు దలంచి)
చంపక ద్రుపదరాజపుత్రికిం దన చేసిన ప్రతిజ్ఞం దలంచి
బధ్ధుండైన గురునందనుం దోడ్కొని కృష్ణుండు సారథ్యంబు
సేయ శిబిరంబుకడకు వచ్చి.

క. 157
సురరాజసుతుఁడు సూపెను, దురవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకున్
బరిచలితాంగశ్రేణిం, బరుష మహాపాశబధ్ధ పాణి ద్రౌణి.

వ. 158.
ఇట్లర్జునుండు దెచ్చి చూపిన బాలవధ జనిత లజ్జా పరాజ్ముఖుండైన గురుని
కొడుకుంజూచి మ్రొక్కి (సుస్వభావయగు) ద్రౌపది యిట్లనియె.

మ. 159
పరఁగన్ మా మగవార లందఱును ము బాణప్రయోగోపసం
హరణా ద్యాయుధవిద్య లన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి పుత్రాకృతి నున్న ద్రోణుఁడవు నీ చిత్తంబులో లేశము
గరుణాసంగము లేక శిష్యసుతుల ఖండింపఁగాఁ బాడియే!

క. 160
భూసురుఁడవు బుధ్ధి దయా, భాసురుఁడవు శుధ్ధవీర భటసందోహా
గ్రేసరుఁడవు శిశుమారణ, మాసురకృత్యంబు ధర్మమగునే తండ్రీ!

శా. 161
ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుధ్ధావని లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటి
భద్రాకారులఁ జిన్నపాపల రణ ప్రోఢక్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతు లెట్లాడనో!

ఉ. 162
అక్కట! పుత్రశోకజని తాకులభావ విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్నభంగి నినుఁ బోరఁ గిరీటి నిబధ్ధుఁజేసి నేఁ
డిక్కడ కీడ్చితెచ్చుట సహింపనిదై భవదీయమాత నేఁ
డెక్కడ నిట్టిశోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో!

వ. 163
అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె.

ఉ. 164
ద్రోణునితో శిఖింబడక ద్రోణకుటుంబిని యున్న దింట న
క్షీణ తనూజశోక వివశీకృతనై విలపించు భంగి నీ
ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో!
ప్రాణ వియుక్తుఁడైన, నతిపాపము బ్రాహ్మణహింస మానరే.

క. 165
భూపాలకులకు విప్రులఁ, గోపింపఁగఁ జేయఁదగదు కోపించినఁ ద
త్కోపానలంబు మొదలికి, భూపాలాటవులఁ గాల్చు భూకంపముగ.

వ. 166
అని యిట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్వ్యళీకంబును
సమంజసంబును శ్లాఘ్యంబునుంగా ద్రౌపది పలుకు పలుకులకు
ధర్మనందనుందు సంతసిల్లె. నకుల సహదేవ సాత్యకి ధనంజయ
కృష్ణులు సమ్మతించిరి. సమ్మతింపక భీముండిట్లనియె.

చ. 167
కొడుకులఁ బట్టి చంపెనని కోపము నొందుదు బాలఘాతకు
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది వీఁడు విప్రుఁడే?
విడువఁగనేల? చంపుఁ డిటు వీనిని మీరలు చంపరేని నా
పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱు.

వ. 168
అని పలికిన నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె, భీముని
సంరంభంబు సూచి హరి చతుర్భుజుండై రెండుచేతుల భీముని
వారించి కడమ రెండుచేతుల ద్రౌపద పుత్రికను దలగం ద్రొబ్బి,
నగుచు భీమున కిట్లనియె.

ఉ. 169
అప్యుఁడు గాఁడు వీఁడు శిశుహంత దురాత్మకుఁ డాతతాయి హం
తవ్యుఁడు బ్రహ్మబంధుఁ డగు దప్పదు నిక్కము "బ్రాహ్మణో న హం
తవ్య" యటంచు వేదవిదితం బగుఁ గావున ధర్మదృష్టిఁగ
ర్తవ్యము వీనిఁ గాచుట యథాస్థితీఁ జూడుము పాండవోత్తమా!

వ. 170
అని సరసాలాపంబు లాడి పవననందను నొడంబఱచి
యర్జునుంజూచి ద్రౌపదికి నాకు భీమసేనునకును సమ్మతంబుగ
మున్న నీ చేసిన ప్రతిజ్ఞయు సిధ్ధించునట్లు నాపంపు సేయుమని
నారయణుం డానతిచ్చిన నర్జునుందు తదనుమతంబున.

శా. 171
విశ్వస్తుత్యుఁడు శుక్రసూనుఁడు మహావీరుండు ఘోరాసిచే
నశ్వత్థామ శిరోజముల్ దఱిఁగి చూడాంత ర్మహారత్నము
శశ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాత బంధంబుల
విశ్వాసంబున నూడ్చి ద్రొబ్బె శిబిరోర్వీభాగముం బాసిపో.

క. 172
నిబ్బరపు బాలహంతయు, గొబ్బునఁ దేజంబు మణియుఁ గోల్పడి నతుఁడై
ప్రబ్బిన చింత విప్రుఁడు, సిబ్బితితో నొడలి గబ్బు సెడి వడిఁజనియెన్.

ఆ. 173
ధనము గొనుటయొండెఁదలఁగొఱుగుటయొండె, నాలయంబు వెడలనడుచుతొండెఁ
గాని చంపఁదగిన కర్మంబు సేసినఁ, జంపఁదగదు విప్రజాతిఁ బతికి.

ప్రథమ స్కంధము 134 - 139

అధ్యాయము - 7 (౭)


వ.134

మ.135
అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయము విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పించఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువన క్షేమంకరబైన భా
గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పఁగ.

వ.136
ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్ధియైన శుకునిచేఁ జదివించె నని చెప్పిన విని శౌనకుండు, నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె ననవుఁడు సూతుండిట్లనియె.

క.137
ధీరులు నిరపేక్షులు నా, త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు, నారాయణుఁ డట్టివాఁడు నవ్యచరిత్రా!

క. 138.
హరిగుణవర్ణన రతుఁడై హరితత్పరుడైన బాదరాయణి శుభ త
త్పరతం బఠించెఁ ద్రిజగ, ద్వరమంగళమైన భాగవత నిగమంబున్.

క.139.
నిగమములు వేయుఁ జదివిన, సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను, నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా!

తెలుగు అంకెలు

0 1 2 3 4 5 6 7 8 9
౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯

ప్రథమ స్కంధము 111 - 133

అధ్యాయము -౬ (6)


వ. 111
ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుండిట్లనియె.

మ. 112
విను మా భిక్షులు నీకు నిట్లు కరుణ విజ్ణానముం జెప్పి పో
యిన బాల్యంబున వృధ్ధభావమున నీ కీరీతి సంచారముల్
చనె నీ కిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించె( ద
త్తనువుం బాసినచంద మెట్లు చెపుమా దాసీసుతత్వంబుతో.

వ. 113
అని యిట్లు వ్యాసుండడిగిన నారదుండిట్లనియె. దాసీపుత్రుండనైన యేను భిక్షులవలన హరివిజ్ఞానంబు గలిగియున్నంత.

సీ.114
మమ్ము నేలినవారి మందిరంబునగల పనులెల్ల( గ్రమమున భక్తి(జేసి
తన పరాధీనత( దల(పదు సొలసితి నలసితి నాకొంటి ననుచు వచ్చు
మాపును రేపును మాతల్లి మోహంబు సొంపార ముద్దాడు చుంచుదువ్వు
దేహంబు నివురు మోదించు( గౌ(గిట( జేర్చు నర్మిలితో నిట్లు నన్ను నన్ను మనుప

ఆ. 115
నేను విడిచిపోక యింట నుండితినయ్య, మోహి(గాక యెఱుక మోసపోక
మాఱుచింతలేక మౌనినై యేనేండ్ల, వా(డ నగుచు( గొన్ని వాసరములు.

క. 116
సదనము వెలువడి తెరువున(, జెదరక మాతల్లి రాత్రి( జీ(కటివేళ
మొదవుం బిదుక(గ నొకఫణి, పదభాగము( గఱచె( ద్రొక్క(బడి మునినాథా!

క. 117
నీలాయత భోగఫణా, వ్యాళానల విషమహోగ్ర వహ్నిజ్వాలా
మాలావినిపాతితయై, వ్రాలె నను గన్నతల్లి వసుమతిమీ(ద.

ఉ. 118
తల్లి ధరిత్రిపై నొఱగి తల్లడపాటునుజెంది చిత్తము
బల్లటిలంగ( బ్రాణములు వాసిన( జూచి కలంగ కేను నా
యుల్లములోన మోహరుచి నొందక సంగమువాసె మేలు రా
జిల్లెనటుంచు విష్ణుపదచంత యొనర్ప(గ బుధ్ధిసేయుచు.

వ. 119

క. 120
సాలావృక కపి భల్లుక, కోలేభ లులాయ శల్య మూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ, వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్.

వ. 121
దుస్తరంబైన నల వేణి కీచక గుల్మ లతా గహ్వరంబుల పొంత నొక రావిమ్రాను డగ్గఱ( గూర్చుండి యే విన్నచంబున నా హృదయగతుం బరమాత్మ స్వరూపు హరిం జింతించితి.

శా. 122
ఆనందాశ్రులు గన్నుల న్వెడల రోమాంచాంబుతో( దత్పద
ధ్యానారూఢు(డ నైన నా తల(పులో న ద్దేవుడుం దో(చె నే
నానందాబ్ధి గతుండైన యెఱు(గలే నైతి నను న్నీశ్వరు
నానా శోకహమైన యత్తనువు గాన న్నేరకట్లంతట.

వ. 123.

ఉ.124
ఏల కుమార! శోషిల(గ నీ జననంబున నన్ను( గాన(గా(
జాలవు నీవు కామముఖ షట్కము నిర్దళితంబుసేసు ని
ర్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని కుయోగి గాన(గా(
జాల(డు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి( జూపితి.

క. 125
నావలన కోర్కియూరిక, పోవదు విడిపించు దోషపుంజములను మ
త్సేవం బుట్టును వైళమ, భావింప(గ నాదుభక్తి బాలక! వింటే.

కం.126
నాయందు గలుగు నీ మది, వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ
కాయంబు విడిచి మీ(దట, మా యనుమతి బుట్ట(గలవు మద్భక్తుడవై.

మ.127
విను మీ సృష్టి లంపంబు నొంది యుగముల్ వెయ్యైన కాలంబు యా
మినియై పోయెడి( బోవ(గా గలుగు(జూ మీ(దం బునః సృష్టి యం
దు నిరూఢ స్మృతితోడ( బుట్టెదవు నిర్దొషుడవై నా కృప
ఘనతం జెందెదు శుధ్ధసాత్త్వికులలో గణ్యుండవై యర్భకా!

వ.128

ఆ.129
తీర్ధపాదు(డైన దేవుండు విష్ణుండు, దనచరిత్ర మేను దవిలి పాడ(
జీర(బడ్డవాని చెలువును నేతెంచి, ఘను(డు నా మనమున( గానవచ్చు.

క.130.
విను మీ సంసారంబును, వననిధిలోముని(గి కర్మవాంఛలచే వే
దన( బడ్డవాని విష్ణుని, గుణవర్ణనము తెప్పసుమ్ము మునీంద్రా!

చ.131
యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యు( గామ రో
షముల( బ్రచోదితంబు యగు శాంతి వహింపదు విష్ణుసేవచే(
గ్రమమున శాంతి( గైకొనిన కైవడి నాదిశరీర జన్మక
ర్మముల రహస్యమెల్ల మునిమండన! చెప్పితి నీవు కోరిన.

వ.132
అని యిట్లు భగవంతుడగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయింపుచు. యదృచ్ఛా మార్గంబునం జనియె నని సూతుండిట్లనియె.

క.133
వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుంద గీతములు జగములకు
జేయించు( జెవులపండువు, మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలడే!

ప్రథమ స్కంధము 101 - 110

-: నారదుని పూర్వజన్మ వృత్తాంతము :-


వ.101
మహత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిటి జన్మంబున వేదవాదుల యింటి
దాసికిం బుట్టి, పిన్ననా(డు వారలచె( బంపంబడి యొక వానకాలంబున
జాతుర్మాస్యంబున నేక స్థలనివాసంబు సేయు నిశ్చయించు యొగిజనులకుం
బరిచర్య సేయుచు.

క.102
ఓటమితో నెల్లప్పుడు, పాటవమున( బనులుసేసి బాలురతోనే
యాటలకు( బోక నొక జం, జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా!

క.103
మంగళ మనుచును వారల, యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్
ముంగల నిలుతును నియతిని, వెంగిలిక్రియ( జనుదునే వివేకముతోడన్.

వ.104
ఇట్లేను వర్షాకాల శరత్కాలంబుల సేవించితిని. వారును నాయందుం గృపసేసి రంత.

శా.105
వారల్ కృష్ణచరిత్రముల్ చదువ(గా వర్ణింప(గా( బాడ(గా
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం
దోవంబై పరిపూర్ణమైన మది సంతోషించి నే నంతటన్
బ్రారంభించితి విష్ణుసేవ కితర ప్రారంభ దూరుండనై.

వ.106

మ.107
అపచారంబులులేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నే( గొలువ(గా సంప్రీతులై వారు నీ
ష్కపటత్వంబున దీనవత్సలతతో( గారుణ్యసమ్యుక్తులై
యుపదేసించిరి నాకు నీశ్వరరహస్యోదార విజ్ఞానము.

వ.108

క.109
ఏ నివ్వధమున( జేయ(గ, దానవకులవైరి నాకు( దనయందలి వి
జ్ఞానము నిచ్చెను మదను, ష్ఠానము నత(డెఱు(గు నీవు సలుపుము దీని.

క.110
మునికులములోన మిక్కిలి, వినుకులు గలవా(డ వీవు విభు కీర్తులు నీ
వనుదినము( బొగడ వినియెడి, జనములకును దుఃఖమెల్ల శాంతింబొందు.

ప్రథమ స్కంధము 87 - 100

అధ్యాయము - ౫ ( 5 )


ఉ. 87
ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్ధజాత వి
జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్త్వ ని
ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే
కాతరు కైవడిన్ వగవ( గారణమేమి పరాశరాత్మజా?

వ. 88
అనిన బారశర్యుం డిట్లనియె.

క. 89
పుట్టితి వజుతనువున( జే, పట్టితివి పురాణపురుషు భజనము పదముల్
మెట్టితివి దిక్కులం దుది, ముట్టితివి మహాప్రభోధమున మునినాథా!

వ. 90
అదియునుంగాక నీవు సూర్యునిభంగి మూ(డులోకములం జరింతువు.
వాయువు పగిది నఖిల జనులలోన మెలంగుదువు. సర్వజ్ఞుండ వగుటంజేసి.

క. 91
నీ కెఱు(గరాని ధర్మము, లోకములనులేదు బహువిలోకివి నీవున్
నాకొఱ(త యెట్టి దంతయు, నాకున్ వివరింపుమయ్య నారద! కారుణన్.

వ. 92
అనిన నారదుండిట్లనియె.

ఉ. 93
అంచితమైన ధర్మచయ మంతయు( జెప్పితి వందులోన నిం
చించుకగాని విష్ణుకథలేర్పడ( జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నిన(గాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరి( గోరి నుతింపమి నార్యపూజితా!

మ. 94
హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థన్వితంబయ్యు శ్రీ
కరమైయుండ దయోగ్య దుర్మదనగ త్కాకోల గర్తాకృతిన్.

మ. 95
అపశబ్దంబుల( గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపా
ప పరిత్యాగము సేయు(గావున హరిన్ భావించుచుం బాడుచున్
జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తుంపుచున్
దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్వజ్ఞ! చింతుంపుమా.

వ.96

చ.97
ఎఱి(గెడువా(డు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్
నెఱయ నెఱింగి యవ్వలన నేరుపుచూపు గుణానురక్తు(డై
తెఱకువలేక క్రుమ్మరుచు దేహ ధనాద్యభిలాషయుక్తు(డై
యెఱుగని వానికిం దెలియ నీశ్వరులీల లెఱుంగ(జెప్పవే.

చ.98
తనకులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
పనివడి సేవసేసి పరిపాకము వొందక యొవ్వ(డేని( జ
చ్చిన మఱుమేననైన నది సిధ్ధివహించు( దదీయ సేవ( బా
సిన( గులధర్మగౌరవము సిధ్ధి వహించెను యెన్ని మేనులన్.

సీ.99
విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱెమియును లేదు విశ్వమునకు
భవవృధ్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీముఖమున
నెఱి(గింప(బడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపును కావున హరిపరాక్రమములెల్ల

ఆ.100
వినుతిసేయు మీవు వినికియు( జదువును, దాన మతులనయము(దపము ధృతియు(
గలిమికెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకు( గమలనాభు( బొగడ( గలిగెనేని.

ప్రథమ స్కంధము 84 - 86

-: వ్యాసుని కడకు నారదుఁడు వచ్చుట :-


సీ. 84
తనచేతి వల్లకీతంత్రీచయంబున సతతనారాయణశబ్దమొప్ప
నానన సంభూత హరిగీతరవసుధాధారల యోగీంద్రతతుల సొక్క(
గపిల జటాభార కాంతిపుంజంబుల దిశలు ప్రభాతదీధితి వహింప(
దనులగ్న తులసికాదామ గంధంబుల గగనాంతరాళంబు( గప్పికొన(గ

ఆ.85
వచ్చె మింటనుండి వాసవీనందను, కడకు మాటలాడ(గణ(క(తోడ
భద్ర విమలకీర్తి పారగు(డారూఢ, నయవిశారదుండు నారదుండు.

క. 86
కనియె న్నారదు(డంతన్, వినయైక విలాసు నిగమ విభజన విద్యా
జనితోల్లాసున్ భవదః, ఖ నిరాసున్ గురుమనోవికాసున్ వ్యాసున్.

వ.
ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదునెఱింగి లేచి వ్యాసుండు
విధివత్ క్రమంబునం బూజించిన నతండు లేనగవు నెగడెడి
మోగంబుతోడ విపంచికాతంత్రి వ్రేలమీటుచు నిట్లనియె.

ప్రథమ స్కంధము 80 - 83

--: వ్యాసుడు వ్యాకుల చిత్తుడై చింతించుట :--


సీ. 80
పైలుండు ఋగ్వేద పఠనంబు దొర(కొనె సామంబు జైమిని చదువుచుండె
యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనె( దుది నధర్వము సుమంతు(డు పథించె
నఖిలపురాణేతిహాసముల్ మాతండ్రి రోమహర్షణు(డు నిరూఢి( దాల్చె(
దమతమవేద మా తపసులు భాగించి శిష్యసంఘములకు( జెప్ప రంత

గీ. 81.
శిష్యులెల్లరు నాత్మీయ శిష్యజనుల, కందుబహుమార్గములుచెప్పి యనుమతింప(
బెక్కుశాఖలుగలిగి యీపృథివిలోన, నిగమ మొప్పారె భూసుర నివహమందు.

సీ. 82.
వ్రతధారినై వేద వహ్ని గురుశ్రేణి మన్నింతు విహితకర్మముల( గొఱ(త
పడకుండ నడపుదు ధారతమిషమున( బలికితి వేదర్థ భావమెల్ల
మునుకొని స్త్రీ శూద్ర ముఖరధర్మములందు( దెలిపితి నే(జెల్ల దీన(జేసి
యాత్మ నంతసమంద దాత్మలో నీశుండు సంతసింపక యున్న జాడదో(చె

ఆ. 83
హరికి యోగివరుల కభిలషితంబైన, భాగవత విధంబు( బలుకనైతి
మోసమయ్యె(దెలివి మెనయదు మఱచితి, ననుచు వగచుచున్న యవసరమున.

ప్రథమ స్కంధము - 71-79


-:శ్రీమద్భాగవత రచనాది వృత్తాంతములు:-

సీ.71
పుణ్యకీర్తును(డైన భువనేశుచరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము
సకలపురాణరాజము దొల్లి లోకభద్రముగ( బుణ్యముగ మోదముగ( బ్రీతి
భగవంతు(డగు వ్యాసభట్టారకు( డొనర్చి శుకు( డనియెడు తన సుతునిచేత(
జదివించె నింతయు సకల వేదేతిహాసములోపలనెల్ల సారమైన

ఆ.72
యీ పురాణమెల్ల నెలమి నా శుకయొగి, గంగనడుమవచ్చి ఘనవిరక్తి
యోదవి మునులతోడ నుపవిష్టు(డగు పరీ, క్షిన్న(రేంద్రు(డడుగ( జెప్పవిను(డు.

అధ్యాయము - 4

శా.73
సూతా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్ఠు నే
శ్రోతల్ గోరిరి యేమి హేతువనకై శోధించి లోకైకవి
ఖ్యాతి వ్యాసు(డు మున్ను భాగవముం గల్పించె( దత్పుత్రు(డే
ప్రీతిన్ రాజున కీ పురాణకథ( జెప్పెన్ జెప్పవే యంతయున్.

వ.74
బుధేంద్రా! వ్యాసపుత్రుండైన సుకుండను మహాయోగి సమదర్శనుం డేకాంతమతిమాయాశయనంబువలనం దెలిసినవా(డు గూఢుండు మూఢునిక్రియ నుండు నిరస్తఖేదుం డదియునుంగాక.

తరల. 75
శుకుడు గో(చియులేక పై(జన(జూచి తోయములందు ల
జ్జకు( జలింపక చీరలొల్లక చల్లులాడెడి దేవక
న్యకలు "హా శుక" యంచు వెన్క( జనంగ వ్యాసుని( జూచి యం
శకములన్ ధరియించి సిగ్గున స్రుక్కిరందఱు ధీనిధీ!

సీ. 76
పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్ల గడిమి నెవ్వా(డు మనియె(
బరిపంథిరాజులు భర్మాదిధనముల నర్చింతు రెవ్వని యంఘ్రియుగము
గుంభజకర్ణాది కురుభటవ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరతండ్రి
గాంగేయసైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరుతాత

ఆ. 77
యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహా, రాజు విడువ(దగని రాజ్యలక్ష్మి(
బరిహరించి గంగ(బ్రాయోపవిష్ణు(డై, యసువులుండ నేల యడ(గియుండె?

ఉ. 78
ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్న(డున్
జిత్తములందు( గోరరు హసించుయు, లోకులకెల్ల నర్థసం
పత్తియు భూతియున్ సుఖము భద్రము( గోరుదు రన్యరక్షణా
త్యుత్తమమైనమేను విభు(డూరక యేల విరక్తి ద్రాసెనో.

క. 79.
సారముల నెల్ల నెఱు(గుదు, పారగు(డవు భాషలందు బహువిధకథనో
దారు(డవు మాకు సర్వము(, బారము ముట్టంగ( దెలియ( బలుకు మహత్మా?