Pages

Subscribe

ప్రథమ స్కంధము 38 - 51

శౌనకాది ఋషుల ప్రశ్న

కం.38
ఆ తాపసు లిట్లనిరి వి, నీతున్ విజ్ఞానఫణితనిఖిల పురాణ
వ్రాతున్ నుతహరిగుణ సం, ఘాతున్ సూతున్ నితాంతకరుణోపేతున్.

మ.39
సమతం దొల్లి పురాణపంక్తు లితిహాసశ్రేణులుం ధర్మశా
స్త్రములున్ నీవు పఠించి చెప్పితివి వేదవ్యాస ముఖ్యుల్, మునుల్,
సుమతుల్ సూచిన వెన్ని యన్నియును దో(చున్ నీమదిన్, దత్ప్రసా
దమునం జేసి యొ`రంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా!

క.40.
గురువులు ప్రియశిష్యులకుం, బరమరహస్యములు దెలియ(బలుకదు రచల
స్థిరకల్యాణం బెయ్యది, పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.

క.41.
మన్నా(డవు చిరకాలము, గన్న(డవు పెక్కులైన గ్రందార్ధంబుల్
విన్న(డవు విన(దగినవు, యున్న(డవు పెద్దలొద్దనుత్తమగోష్ఠిన్.

చ.42.
అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం
కలితులు మందభాగ్యులు సుకర్మములెయ్యవి సేయ(జాలరీ
కలియుగమనందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే.

సీ.
ఎవ్వని యవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది(జేయు
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ సంసారబంధంబు సమసిపోవు
నెవ్వని చరితంబు హౄదయంబు( జేర్చిన భయమొంది మృత్యువు పరువువెట్టు
నెవ్వని పదనది నేపారుజలములు సేవింప నైర్మల్యసిద్ధి గలుగు(

తే.43.
దపసు లెవ్వనిపాదంబు దగిలి శంతి, తెఱ(గు గాంచిరి వసుదేవదేవకులకు
నెవ్వ( డుదయించె( దత్కథలెల్ల విన(గ, నిచ్చపుట్టెడు నెఱి(గింపు మిద్ధచరిత.

క.44.
భూషణములు వాణికి నఘ, పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తొషణములు గల్యాణ వి, శేషణములు హరిగుణోపచితభాషణముల్.

క.45.
కలిదోష నివారకమై, యలఘు యశుల్ వొగడునట్టి హరికధనము ని
ర్మలగతి( గోరెడు పురుషు(డు, వెలయ(గ నెవ్వా(డు దగిలి విన(డు మహత్మా!

ఆ.46.
అనఘ విను రసజ్ఞులై వినువారికి, మాటమాట కధికమధురమైన
యట్టి కృష్ణుకథన మాకర్ణనముసేయు, దల(పుగలదు మాకు( దనివిలేదు.

మ.47.
పరగోవింద కథాసుధారస మహావర్షోరుధారా పరం
పరలంగాక బుధేంద్రచంద్ర! యితరోపాయాసురక్తిం బ్రవి
స్తర దుర్దాంతదురంత దుస్సహజనుస్సంభావితానేక దు
స్తర గంభీరకఠొరకల్మష కనద్దవానలం బాఱునే.

సీ.
హరినామకధన దావానల జ్వాలల( గాలవే ఘోరాఘ కాననములు
వైకుంథదర్శన వాయుసంఘంబుచె( దొల(గవే బహుదుఃఖ తోయదములు
కమలనాభధ్యాన కంఠీరవంబుచే( గూలవే సంతాప కుంజరములు
నారయణస్మరణ ప్రభాకరదీప్తి( దీఱవె షడ్వర్గ తిమిరతతులు

ఆ.48.
నళిననయన భక్తి నావచేగాక సం, సార జలధిదాటి చనగరాదు
వేయునేల మాకు విష్నుప్రభావంబు, దెలుపవయ్య సూత! ధీసమేత!

వ.49.
మఱియు కపటమానవండును గూఢుండునైన మాధవుండు రామసహితుండై యతిమానుషంబులైన పరాక్రమంబులు సేసెనట! వాని వివరింపుము. కలియుగంబు రాగలదని వైష్ణవక్షేత్రంబున దీర్ఘ సత్రనిమిత్తంబున హరికథలు విననెడగలిగి నిలిచితిమి. దైవయొగంబున

క.50.
జలరాశి దాటగోరెడి, కలము జనుల్ గర్ణధారు(గాంచిన భంగిన్
గలిదోష హరణవాంఛా, కలితులమగు మేము నిన్నుగంటిమి సూతా!

క.51.
చారుతరధర్మరాశికి, భారకుడగు కృష్ణుడాత్మపదమునకేగన్
ధారకుడు లేక యెవ్వని, జేరెను ధర్మంబు బలుపుసెడి మునినాథా!

0 comments: