Pages

Subscribe

ప్రథమ స్కంధము 32 - 35

సీ.32.
విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వనివలన నేర్పడు ననువర్తమున
వ్యావర్తనమున( గార్యములం దభిజ్ఞు(డై తాన రాజగుచు( జిత్తమున( జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వ(డు బుధులు మోహింతు రెవ్వ
నికి నెండమావుల నీట( గాచాదుల నన్యోన్యబుధ్ధి దా నడరునట్లు
ఆ.
త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము, భంగి( దో(చు స్వప్రభానిరస్త
కుహకు( డెవ్వ( డతని(గోరి చింతించెద, ననఘు విశ్వమయుని ననుదినంబు.

వ. 33.
ఇట్లు "సత్యం పరం ధీమహి" యను గాయత్రీ ప్రారంభున గయత్రీనామ బ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నదికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందు( జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబున నొప్పుచుండు.

సీ.34.

శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ
విన(గోరువారల విములచిత్తంబుల( జెచ్చెర నీశుండు చిక్కు( గాక
యితర శాస్త్రంబుల నీశండు చిక్కునె మంచివారలకు నిర్మత్సరులకు
గపటనిర్ముక్తులై కాంక్ష సేయక యిందు( దగిలియుందుట మహాతత్వబుధ్ధి.

తే.
పర(గ నాధ్యాత్మికాది తాపత్రయంబు, నడ(చి పరమార్ధభూతమై యఖిల సుఖద
మైసమస్తంబుగాకయు నయ్యునుండు, వస్తువెఱుగంగ( దగుభాగవతమునందు.

ఆ.35.
వేదకల్పవృక్షవిగళితమై శుక, ముఖసుధాద్రావమున మొనసియున్న
భాగవతపురాణ ఫలరసాస్వాదన, పదవి( గనుడు రసిక భావవిదులు.

0 comments: