Pages

Subscribe

ప్రథమ స్కంధము 87 - 100

అధ్యాయము - ౫ ( 5 )


ఉ. 87
ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్ధజాత వి
జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్త్వ ని
ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే
కాతరు కైవడిన్ వగవ( గారణమేమి పరాశరాత్మజా?

వ. 88
అనిన బారశర్యుం డిట్లనియె.

క. 89
పుట్టితి వజుతనువున( జే, పట్టితివి పురాణపురుషు భజనము పదముల్
మెట్టితివి దిక్కులం దుది, ముట్టితివి మహాప్రభోధమున మునినాథా!

వ. 90
అదియునుంగాక నీవు సూర్యునిభంగి మూ(డులోకములం జరింతువు.
వాయువు పగిది నఖిల జనులలోన మెలంగుదువు. సర్వజ్ఞుండ వగుటంజేసి.

క. 91
నీ కెఱు(గరాని ధర్మము, లోకములనులేదు బహువిలోకివి నీవున్
నాకొఱ(త యెట్టి దంతయు, నాకున్ వివరింపుమయ్య నారద! కారుణన్.

వ. 92
అనిన నారదుండిట్లనియె.

ఉ. 93
అంచితమైన ధర్మచయ మంతయు( జెప్పితి వందులోన నిం
చించుకగాని విష్ణుకథలేర్పడ( జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నిన(గాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరి( గోరి నుతింపమి నార్యపూజితా!

మ. 94
హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థన్వితంబయ్యు శ్రీ
కరమైయుండ దయోగ్య దుర్మదనగ త్కాకోల గర్తాకృతిన్.

మ. 95
అపశబ్దంబుల( గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపా
ప పరిత్యాగము సేయు(గావున హరిన్ భావించుచుం బాడుచున్
జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తుంపుచున్
దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్వజ్ఞ! చింతుంపుమా.

వ.96

చ.97
ఎఱి(గెడువా(డు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్
నెఱయ నెఱింగి యవ్వలన నేరుపుచూపు గుణానురక్తు(డై
తెఱకువలేక క్రుమ్మరుచు దేహ ధనాద్యభిలాషయుక్తు(డై
యెఱుగని వానికిం దెలియ నీశ్వరులీల లెఱుంగ(జెప్పవే.

చ.98
తనకులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
పనివడి సేవసేసి పరిపాకము వొందక యొవ్వ(డేని( జ
చ్చిన మఱుమేననైన నది సిధ్ధివహించు( దదీయ సేవ( బా
సిన( గులధర్మగౌరవము సిధ్ధి వహించెను యెన్ని మేనులన్.

సీ.99
విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱెమియును లేదు విశ్వమునకు
భవవృధ్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీముఖమున
నెఱి(గింప(బడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపును కావున హరిపరాక్రమములెల్ల

ఆ.100
వినుతిసేయు మీవు వినికియు( జదువును, దాన మతులనయము(దపము ధృతియు(
గలిమికెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకు( గమలనాభు( బొగడ( గలిగెనేని.

0 comments: