Pages

Subscribe

ప్రథమ స్కంధము 84 - 86

-: వ్యాసుని కడకు నారదుఁడు వచ్చుట :-


సీ. 84
తనచేతి వల్లకీతంత్రీచయంబున సతతనారాయణశబ్దమొప్ప
నానన సంభూత హరిగీతరవసుధాధారల యోగీంద్రతతుల సొక్క(
గపిల జటాభార కాంతిపుంజంబుల దిశలు ప్రభాతదీధితి వహింప(
దనులగ్న తులసికాదామ గంధంబుల గగనాంతరాళంబు( గప్పికొన(గ

ఆ.85
వచ్చె మింటనుండి వాసవీనందను, కడకు మాటలాడ(గణ(క(తోడ
భద్ర విమలకీర్తి పారగు(డారూఢ, నయవిశారదుండు నారదుండు.

క. 86
కనియె న్నారదు(డంతన్, వినయైక విలాసు నిగమ విభజన విద్యా
జనితోల్లాసున్ భవదః, ఖ నిరాసున్ గురుమనోవికాసున్ వ్యాసున్.

వ.
ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదునెఱింగి లేచి వ్యాసుండు
విధివత్ క్రమంబునం బూజించిన నతండు లేనగవు నెగడెడి
మోగంబుతోడ విపంచికాతంత్రి వ్రేలమీటుచు నిట్లనియె.

0 comments: