Pages

Subscribe

ప్రథమ స్కంధము 101 - 110

-: నారదుని పూర్వజన్మ వృత్తాంతము :-


వ.101
మహత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిటి జన్మంబున వేదవాదుల యింటి
దాసికిం బుట్టి, పిన్ననా(డు వారలచె( బంపంబడి యొక వానకాలంబున
జాతుర్మాస్యంబున నేక స్థలనివాసంబు సేయు నిశ్చయించు యొగిజనులకుం
బరిచర్య సేయుచు.

క.102
ఓటమితో నెల్లప్పుడు, పాటవమున( బనులుసేసి బాలురతోనే
యాటలకు( బోక నొక జం, జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా!

క.103
మంగళ మనుచును వారల, యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్
ముంగల నిలుతును నియతిని, వెంగిలిక్రియ( జనుదునే వివేకముతోడన్.

వ.104
ఇట్లేను వర్షాకాల శరత్కాలంబుల సేవించితిని. వారును నాయందుం గృపసేసి రంత.

శా.105
వారల్ కృష్ణచరిత్రముల్ చదువ(గా వర్ణింప(గా( బాడ(గా
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం
దోవంబై పరిపూర్ణమైన మది సంతోషించి నే నంతటన్
బ్రారంభించితి విష్ణుసేవ కితర ప్రారంభ దూరుండనై.

వ.106

మ.107
అపచారంబులులేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నే( గొలువ(గా సంప్రీతులై వారు నీ
ష్కపటత్వంబున దీనవత్సలతతో( గారుణ్యసమ్యుక్తులై
యుపదేసించిరి నాకు నీశ్వరరహస్యోదార విజ్ఞానము.

వ.108

క.109
ఏ నివ్వధమున( జేయ(గ, దానవకులవైరి నాకు( దనయందలి వి
జ్ఞానము నిచ్చెను మదను, ష్ఠానము నత(డెఱు(గు నీవు సలుపుము దీని.

క.110
మునికులములోన మిక్కిలి, వినుకులు గలవా(డ వీవు విభు కీర్తులు నీ
వనుదినము( బొగడ వినియెడి, జనములకును దుఃఖమెల్ల శాంతింబొందు.

0 comments: