Pages

Subscribe

ప్రథమ స్కంధము 111 - 133

అధ్యాయము -౬ (6)


వ. 111
ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుండిట్లనియె.

మ. 112
విను మా భిక్షులు నీకు నిట్లు కరుణ విజ్ణానముం జెప్పి పో
యిన బాల్యంబున వృధ్ధభావమున నీ కీరీతి సంచారముల్
చనె నీ కిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించె( ద
త్తనువుం బాసినచంద మెట్లు చెపుమా దాసీసుతత్వంబుతో.

వ. 113
అని యిట్లు వ్యాసుండడిగిన నారదుండిట్లనియె. దాసీపుత్రుండనైన యేను భిక్షులవలన హరివిజ్ఞానంబు గలిగియున్నంత.

సీ.114
మమ్ము నేలినవారి మందిరంబునగల పనులెల్ల( గ్రమమున భక్తి(జేసి
తన పరాధీనత( దల(పదు సొలసితి నలసితి నాకొంటి ననుచు వచ్చు
మాపును రేపును మాతల్లి మోహంబు సొంపార ముద్దాడు చుంచుదువ్వు
దేహంబు నివురు మోదించు( గౌ(గిట( జేర్చు నర్మిలితో నిట్లు నన్ను నన్ను మనుప

ఆ. 115
నేను విడిచిపోక యింట నుండితినయ్య, మోహి(గాక యెఱుక మోసపోక
మాఱుచింతలేక మౌనినై యేనేండ్ల, వా(డ నగుచు( గొన్ని వాసరములు.

క. 116
సదనము వెలువడి తెరువున(, జెదరక మాతల్లి రాత్రి( జీ(కటివేళ
మొదవుం బిదుక(గ నొకఫణి, పదభాగము( గఱచె( ద్రొక్క(బడి మునినాథా!

క. 117
నీలాయత భోగఫణా, వ్యాళానల విషమహోగ్ర వహ్నిజ్వాలా
మాలావినిపాతితయై, వ్రాలె నను గన్నతల్లి వసుమతిమీ(ద.

ఉ. 118
తల్లి ధరిత్రిపై నొఱగి తల్లడపాటునుజెంది చిత్తము
బల్లటిలంగ( బ్రాణములు వాసిన( జూచి కలంగ కేను నా
యుల్లములోన మోహరుచి నొందక సంగమువాసె మేలు రా
జిల్లెనటుంచు విష్ణుపదచంత యొనర్ప(గ బుధ్ధిసేయుచు.

వ. 119

క. 120
సాలావృక కపి భల్లుక, కోలేభ లులాయ శల్య మూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ, వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్.

వ. 121
దుస్తరంబైన నల వేణి కీచక గుల్మ లతా గహ్వరంబుల పొంత నొక రావిమ్రాను డగ్గఱ( గూర్చుండి యే విన్నచంబున నా హృదయగతుం బరమాత్మ స్వరూపు హరిం జింతించితి.

శా. 122
ఆనందాశ్రులు గన్నుల న్వెడల రోమాంచాంబుతో( దత్పద
ధ్యానారూఢు(డ నైన నా తల(పులో న ద్దేవుడుం దో(చె నే
నానందాబ్ధి గతుండైన యెఱు(గలే నైతి నను న్నీశ్వరు
నానా శోకహమైన యత్తనువు గాన న్నేరకట్లంతట.

వ. 123.

ఉ.124
ఏల కుమార! శోషిల(గ నీ జననంబున నన్ను( గాన(గా(
జాలవు నీవు కామముఖ షట్కము నిర్దళితంబుసేసు ని
ర్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని కుయోగి గాన(గా(
జాల(డు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి( జూపితి.

క. 125
నావలన కోర్కియూరిక, పోవదు విడిపించు దోషపుంజములను మ
త్సేవం బుట్టును వైళమ, భావింప(గ నాదుభక్తి బాలక! వింటే.

కం.126
నాయందు గలుగు నీ మది, వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ
కాయంబు విడిచి మీ(దట, మా యనుమతి బుట్ట(గలవు మద్భక్తుడవై.

మ.127
విను మీ సృష్టి లంపంబు నొంది యుగముల్ వెయ్యైన కాలంబు యా
మినియై పోయెడి( బోవ(గా గలుగు(జూ మీ(దం బునః సృష్టి యం
దు నిరూఢ స్మృతితోడ( బుట్టెదవు నిర్దొషుడవై నా కృప
ఘనతం జెందెదు శుధ్ధసాత్త్వికులలో గణ్యుండవై యర్భకా!

వ.128

ఆ.129
తీర్ధపాదు(డైన దేవుండు విష్ణుండు, దనచరిత్ర మేను దవిలి పాడ(
జీర(బడ్డవాని చెలువును నేతెంచి, ఘను(డు నా మనమున( గానవచ్చు.

క.130.
విను మీ సంసారంబును, వననిధిలోముని(గి కర్మవాంఛలచే వే
దన( బడ్డవాని విష్ణుని, గుణవర్ణనము తెప్పసుమ్ము మునీంద్రా!

చ.131
యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యు( గామ రో
షముల( బ్రచోదితంబు యగు శాంతి వహింపదు విష్ణుసేవచే(
గ్రమమున శాంతి( గైకొనిన కైవడి నాదిశరీర జన్మక
ర్మముల రహస్యమెల్ల మునిమండన! చెప్పితి నీవు కోరిన.

వ.132
అని యిట్లు భగవంతుడగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయింపుచు. యదృచ్ఛా మార్గంబునం జనియె నని సూతుండిట్లనియె.

క.133
వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుంద గీతములు జగములకు
జేయించు( జెవులపండువు, మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలడే!

0 comments: