Pages

Subscribe

ప్రథమ స్కంధము 111 - 133

అధ్యాయము -౬ (6)


వ. 111
ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుండిట్లనియె.

మ. 112
విను మా భిక్షులు నీకు నిట్లు కరుణ విజ్ణానముం జెప్పి పో
యిన బాల్యంబున వృధ్ధభావమున నీ కీరీతి సంచారముల్
చనె నీ కిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించె( ద
త్తనువుం బాసినచంద మెట్లు చెపుమా దాసీసుతత్వంబుతో.

వ. 113
అని యిట్లు వ్యాసుండడిగిన నారదుండిట్లనియె. దాసీపుత్రుండనైన యేను భిక్షులవలన హరివిజ్ఞానంబు గలిగియున్నంత.

సీ.114
మమ్ము నేలినవారి మందిరంబునగల పనులెల్ల( గ్రమమున భక్తి(జేసి
తన పరాధీనత( దల(పదు సొలసితి నలసితి నాకొంటి ననుచు వచ్చు
మాపును రేపును మాతల్లి మోహంబు సొంపార ముద్దాడు చుంచుదువ్వు
దేహంబు నివురు మోదించు( గౌ(గిట( జేర్చు నర్మిలితో నిట్లు నన్ను నన్ను మనుప

ఆ. 115
నేను విడిచిపోక యింట నుండితినయ్య, మోహి(గాక యెఱుక మోసపోక
మాఱుచింతలేక మౌనినై యేనేండ్ల, వా(డ నగుచు( గొన్ని వాసరములు.

క. 116
సదనము వెలువడి తెరువున(, జెదరక మాతల్లి రాత్రి( జీ(కటివేళ
మొదవుం బిదుక(గ నొకఫణి, పదభాగము( గఱచె( ద్రొక్క(బడి మునినాథా!

క. 117
నీలాయత భోగఫణా, వ్యాళానల విషమహోగ్ర వహ్నిజ్వాలా
మాలావినిపాతితయై, వ్రాలె నను గన్నతల్లి వసుమతిమీ(ద.

ఉ. 118
తల్లి ధరిత్రిపై నొఱగి తల్లడపాటునుజెంది చిత్తము
బల్లటిలంగ( బ్రాణములు వాసిన( జూచి కలంగ కేను నా
యుల్లములోన మోహరుచి నొందక సంగమువాసె మేలు రా
జిల్లెనటుంచు విష్ణుపదచంత యొనర్ప(గ బుధ్ధిసేయుచు.

వ. 119

క. 120
సాలావృక కపి భల్లుక, కోలేభ లులాయ శల్య మూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ, వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్.

వ. 121
దుస్తరంబైన నల వేణి కీచక గుల్మ లతా గహ్వరంబుల పొంత నొక రావిమ్రాను డగ్గఱ( గూర్చుండి యే విన్నచంబున నా హృదయగతుం బరమాత్మ స్వరూపు హరిం జింతించితి.

శా. 122
ఆనందాశ్రులు గన్నుల న్వెడల రోమాంచాంబుతో( దత్పద
ధ్యానారూఢు(డ నైన నా తల(పులో న ద్దేవుడుం దో(చె నే
నానందాబ్ధి గతుండైన యెఱు(గలే నైతి నను న్నీశ్వరు
నానా శోకహమైన యత్తనువు గాన న్నేరకట్లంతట.

వ. 123.

ఉ.124
ఏల కుమార! శోషిల(గ నీ జననంబున నన్ను( గాన(గా(
జాలవు నీవు కామముఖ షట్కము నిర్దళితంబుసేసు ని
ర్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని కుయోగి గాన(గా(
జాల(డు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి( జూపితి.

క. 125
నావలన కోర్కియూరిక, పోవదు విడిపించు దోషపుంజములను మ
త్సేవం బుట్టును వైళమ, భావింప(గ నాదుభక్తి బాలక! వింటే.

కం.126
నాయందు గలుగు నీ మది, వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ
కాయంబు విడిచి మీ(దట, మా యనుమతి బుట్ట(గలవు మద్భక్తుడవై.

మ.127
విను మీ సృష్టి లంపంబు నొంది యుగముల్ వెయ్యైన కాలంబు యా
మినియై పోయెడి( బోవ(గా గలుగు(జూ మీ(దం బునః సృష్టి యం
దు నిరూఢ స్మృతితోడ( బుట్టెదవు నిర్దొషుడవై నా కృప
ఘనతం జెందెదు శుధ్ధసాత్త్వికులలో గణ్యుండవై యర్భకా!

వ.128

ఆ.129
తీర్ధపాదు(డైన దేవుండు విష్ణుండు, దనచరిత్ర మేను దవిలి పాడ(
జీర(బడ్డవాని చెలువును నేతెంచి, ఘను(డు నా మనమున( గానవచ్చు.

క.130.
విను మీ సంసారంబును, వననిధిలోముని(గి కర్మవాంఛలచే వే
దన( బడ్డవాని విష్ణుని, గుణవర్ణనము తెప్పసుమ్ము మునీంద్రా!

చ.131
యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యు( గామ రో
షముల( బ్రచోదితంబు యగు శాంతి వహింపదు విష్ణుసేవచే(
గ్రమమున శాంతి( గైకొనిన కైవడి నాదిశరీర జన్మక
ర్మముల రహస్యమెల్ల మునిమండన! చెప్పితి నీవు కోరిన.

వ.132
అని యిట్లు భగవంతుడగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయింపుచు. యదృచ్ఛా మార్గంబునం జనియె నని సూతుండిట్లనియె.

క.133
వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుంద గీతములు జగములకు
జేయించు( జెవులపండువు, మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలడే!

ప్రథమ స్కంధము 101 - 110

-: నారదుని పూర్వజన్మ వృత్తాంతము :-


వ.101
మహత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిటి జన్మంబున వేదవాదుల యింటి
దాసికిం బుట్టి, పిన్ననా(డు వారలచె( బంపంబడి యొక వానకాలంబున
జాతుర్మాస్యంబున నేక స్థలనివాసంబు సేయు నిశ్చయించు యొగిజనులకుం
బరిచర్య సేయుచు.

క.102
ఓటమితో నెల్లప్పుడు, పాటవమున( బనులుసేసి బాలురతోనే
యాటలకు( బోక నొక జం, జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా!

క.103
మంగళ మనుచును వారల, యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్
ముంగల నిలుతును నియతిని, వెంగిలిక్రియ( జనుదునే వివేకముతోడన్.

వ.104
ఇట్లేను వర్షాకాల శరత్కాలంబుల సేవించితిని. వారును నాయందుం గృపసేసి రంత.

శా.105
వారల్ కృష్ణచరిత్రముల్ చదువ(గా వర్ణింప(గా( బాడ(గా
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం
దోవంబై పరిపూర్ణమైన మది సంతోషించి నే నంతటన్
బ్రారంభించితి విష్ణుసేవ కితర ప్రారంభ దూరుండనై.

వ.106

మ.107
అపచారంబులులేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నే( గొలువ(గా సంప్రీతులై వారు నీ
ష్కపటత్వంబున దీనవత్సలతతో( గారుణ్యసమ్యుక్తులై
యుపదేసించిరి నాకు నీశ్వరరహస్యోదార విజ్ఞానము.

వ.108

క.109
ఏ నివ్వధమున( జేయ(గ, దానవకులవైరి నాకు( దనయందలి వి
జ్ఞానము నిచ్చెను మదను, ష్ఠానము నత(డెఱు(గు నీవు సలుపుము దీని.

క.110
మునికులములోన మిక్కిలి, వినుకులు గలవా(డ వీవు విభు కీర్తులు నీ
వనుదినము( బొగడ వినియెడి, జనములకును దుఃఖమెల్ల శాంతింబొందు.

ప్రథమ స్కంధము 87 - 100

అధ్యాయము - ౫ ( 5 )


ఉ. 87
ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్ధజాత వి
జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్త్వ ని
ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే
కాతరు కైవడిన్ వగవ( గారణమేమి పరాశరాత్మజా?

వ. 88
అనిన బారశర్యుం డిట్లనియె.

క. 89
పుట్టితి వజుతనువున( జే, పట్టితివి పురాణపురుషు భజనము పదముల్
మెట్టితివి దిక్కులం దుది, ముట్టితివి మహాప్రభోధమున మునినాథా!

వ. 90
అదియునుంగాక నీవు సూర్యునిభంగి మూ(డులోకములం జరింతువు.
వాయువు పగిది నఖిల జనులలోన మెలంగుదువు. సర్వజ్ఞుండ వగుటంజేసి.

క. 91
నీ కెఱు(గరాని ధర్మము, లోకములనులేదు బహువిలోకివి నీవున్
నాకొఱ(త యెట్టి దంతయు, నాకున్ వివరింపుమయ్య నారద! కారుణన్.

వ. 92
అనిన నారదుండిట్లనియె.

ఉ. 93
అంచితమైన ధర్మచయ మంతయు( జెప్పితి వందులోన నిం
చించుకగాని విష్ణుకథలేర్పడ( జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నిన(గాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరి( గోరి నుతింపమి నార్యపూజితా!

మ. 94
హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థన్వితంబయ్యు శ్రీ
కరమైయుండ దయోగ్య దుర్మదనగ త్కాకోల గర్తాకృతిన్.

మ. 95
అపశబ్దంబుల( గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపా
ప పరిత్యాగము సేయు(గావున హరిన్ భావించుచుం బాడుచున్
జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తుంపుచున్
దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్వజ్ఞ! చింతుంపుమా.

వ.96

చ.97
ఎఱి(గెడువా(డు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్
నెఱయ నెఱింగి యవ్వలన నేరుపుచూపు గుణానురక్తు(డై
తెఱకువలేక క్రుమ్మరుచు దేహ ధనాద్యభిలాషయుక్తు(డై
యెఱుగని వానికిం దెలియ నీశ్వరులీల లెఱుంగ(జెప్పవే.

చ.98
తనకులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
పనివడి సేవసేసి పరిపాకము వొందక యొవ్వ(డేని( జ
చ్చిన మఱుమేననైన నది సిధ్ధివహించు( దదీయ సేవ( బా
సిన( గులధర్మగౌరవము సిధ్ధి వహించెను యెన్ని మేనులన్.

సీ.99
విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱెమియును లేదు విశ్వమునకు
భవవృధ్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీముఖమున
నెఱి(గింప(బడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపును కావున హరిపరాక్రమములెల్ల

ఆ.100
వినుతిసేయు మీవు వినికియు( జదువును, దాన మతులనయము(దపము ధృతియు(
గలిమికెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకు( గమలనాభు( బొగడ( గలిగెనేని.

ప్రథమ స్కంధము 84 - 86

-: వ్యాసుని కడకు నారదుఁడు వచ్చుట :-


సీ. 84
తనచేతి వల్లకీతంత్రీచయంబున సతతనారాయణశబ్దమొప్ప
నానన సంభూత హరిగీతరవసుధాధారల యోగీంద్రతతుల సొక్క(
గపిల జటాభార కాంతిపుంజంబుల దిశలు ప్రభాతదీధితి వహింప(
దనులగ్న తులసికాదామ గంధంబుల గగనాంతరాళంబు( గప్పికొన(గ

ఆ.85
వచ్చె మింటనుండి వాసవీనందను, కడకు మాటలాడ(గణ(క(తోడ
భద్ర విమలకీర్తి పారగు(డారూఢ, నయవిశారదుండు నారదుండు.

క. 86
కనియె న్నారదు(డంతన్, వినయైక విలాసు నిగమ విభజన విద్యా
జనితోల్లాసున్ భవదః, ఖ నిరాసున్ గురుమనోవికాసున్ వ్యాసున్.

వ.
ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదునెఱింగి లేచి వ్యాసుండు
విధివత్ క్రమంబునం బూజించిన నతండు లేనగవు నెగడెడి
మోగంబుతోడ విపంచికాతంత్రి వ్రేలమీటుచు నిట్లనియె.

ప్రథమ స్కంధము 80 - 83

--: వ్యాసుడు వ్యాకుల చిత్తుడై చింతించుట :--


సీ. 80
పైలుండు ఋగ్వేద పఠనంబు దొర(కొనె సామంబు జైమిని చదువుచుండె
యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనె( దుది నధర్వము సుమంతు(డు పథించె
నఖిలపురాణేతిహాసముల్ మాతండ్రి రోమహర్షణు(డు నిరూఢి( దాల్చె(
దమతమవేద మా తపసులు భాగించి శిష్యసంఘములకు( జెప్ప రంత

గీ. 81.
శిష్యులెల్లరు నాత్మీయ శిష్యజనుల, కందుబహుమార్గములుచెప్పి యనుమతింప(
బెక్కుశాఖలుగలిగి యీపృథివిలోన, నిగమ మొప్పారె భూసుర నివహమందు.

సీ. 82.
వ్రతధారినై వేద వహ్ని గురుశ్రేణి మన్నింతు విహితకర్మముల( గొఱ(త
పడకుండ నడపుదు ధారతమిషమున( బలికితి వేదర్థ భావమెల్ల
మునుకొని స్త్రీ శూద్ర ముఖరధర్మములందు( దెలిపితి నే(జెల్ల దీన(జేసి
యాత్మ నంతసమంద దాత్మలో నీశుండు సంతసింపక యున్న జాడదో(చె

ఆ. 83
హరికి యోగివరుల కభిలషితంబైన, భాగవత విధంబు( బలుకనైతి
మోసమయ్యె(దెలివి మెనయదు మఱచితి, ననుచు వగచుచున్న యవసరమున.