Pages

Subscribe

ప్రథమ స్కంధము - 71-79


-:శ్రీమద్భాగవత రచనాది వృత్తాంతములు:-

సీ.71
పుణ్యకీర్తును(డైన భువనేశుచరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము
సకలపురాణరాజము దొల్లి లోకభద్రముగ( బుణ్యముగ మోదముగ( బ్రీతి
భగవంతు(డగు వ్యాసభట్టారకు( డొనర్చి శుకు( డనియెడు తన సుతునిచేత(
జదివించె నింతయు సకల వేదేతిహాసములోపలనెల్ల సారమైన

ఆ.72
యీ పురాణమెల్ల నెలమి నా శుకయొగి, గంగనడుమవచ్చి ఘనవిరక్తి
యోదవి మునులతోడ నుపవిష్టు(డగు పరీ, క్షిన్న(రేంద్రు(డడుగ( జెప్పవిను(డు.

అధ్యాయము - 4

శా.73
సూతా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్ఠు నే
శ్రోతల్ గోరిరి యేమి హేతువనకై శోధించి లోకైకవి
ఖ్యాతి వ్యాసు(డు మున్ను భాగవముం గల్పించె( దత్పుత్రు(డే
ప్రీతిన్ రాజున కీ పురాణకథ( జెప్పెన్ జెప్పవే యంతయున్.

వ.74
బుధేంద్రా! వ్యాసపుత్రుండైన సుకుండను మహాయోగి సమదర్శనుం డేకాంతమతిమాయాశయనంబువలనం దెలిసినవా(డు గూఢుండు మూఢునిక్రియ నుండు నిరస్తఖేదుం డదియునుంగాక.

తరల. 75
శుకుడు గో(చియులేక పై(జన(జూచి తోయములందు ల
జ్జకు( జలింపక చీరలొల్లక చల్లులాడెడి దేవక
న్యకలు "హా శుక" యంచు వెన్క( జనంగ వ్యాసుని( జూచి యం
శకములన్ ధరియించి సిగ్గున స్రుక్కిరందఱు ధీనిధీ!

సీ. 76
పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్ల గడిమి నెవ్వా(డు మనియె(
బరిపంథిరాజులు భర్మాదిధనముల నర్చింతు రెవ్వని యంఘ్రియుగము
గుంభజకర్ణాది కురుభటవ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరతండ్రి
గాంగేయసైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరుతాత

ఆ. 77
యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహా, రాజు విడువ(దగని రాజ్యలక్ష్మి(
బరిహరించి గంగ(బ్రాయోపవిష్ణు(డై, యసువులుండ నేల యడ(గియుండె?

ఉ. 78
ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్న(డున్
జిత్తములందు( గోరరు హసించుయు, లోకులకెల్ల నర్థసం
పత్తియు భూతియున్ సుఖము భద్రము( గోరుదు రన్యరక్షణా
త్యుత్తమమైనమేను విభు(డూరక యేల విరక్తి ద్రాసెనో.

క. 79.
సారముల నెల్ల నెఱు(గుదు, పారగు(డవు భాషలందు బహువిధకథనో
దారు(డవు మాకు సర్వము(, బారము ముట్టంగ( దెలియ( బలుకు మహత్మా?