Pages

Subscribe

ప్రథమ స్కంధము - 60-70

-: భగవంతుని యేకవింశత్యవతారములు :-


సీ.
మహదానందకార తన్మాత్ర సమ్యుక్తుడై చారుషొడశకళా సహితు(డగుచు(
బంచమహాభూత భాసితుండై శుద్ధసత్త్వుడై సర్వాతిశాయి యగుచు(
జరణోరుభుజముఖ శ్రవణాక్షినాసా శిరములు నానాసహస్రములు వెలు(గ
సంబరకేయూర హారకుండలికి రీటాదులు పెక్కువే లమరుచుండ(

తే.60.
బురుషరూపంబు ధరియించు పరు(డనంతు(, డఖిలభువనైక కర్తయై యలఘుగతిని
మానితాపార జలరాశిమధ్యమునను, యోగనిద్రావిలాసియై యొప్పచుండు.

వ.61.
మ.62.
సరసిం బాసిన వేయుకాలువల యోజన్ విష్ణునందైన శ్రీ
కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ సమ్యమీంద్రులు మహర్షుల్ విష్ణునంశంసముల్
హరి కృష్ణుండు బలానుజన్మ( డెడలె దావిష్ణు(డా నేర్పడన్.

క.63.
భగవంతుడు విష్ణువు, జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్
దగనవ్వెళల దయతో, యుగయుగమున( బుట్టి కాచునుద్యల్లీలన్.

ఆ.64.
అతిరహస్యమైన హరిజన్మకథనంబు, మనుజు(డెవ్వ(డేని మాపురేపు(
జాలభక్తితోడ( జదివిన సంసార, దుఃఖరాశి( బాసి తొలగిపోవు.

వ.65.

చ.66.
జననములేక కర్మముజాడల(బోక సమస్తచిత్త వ
ర్తను(డగు చక్రికిన్ గవు లుదారపదంబుల జన్మకర్మముల్
వినుతుల్ సేయుచుండుదురు వేదరహస్యములందు నెందు(జూ
చిన మఱిలేవు జీవునికి(జెప్పినకైవడి జన్మకర్మముల్.

మ.67.
భువనశ్రేణి నమోఘలీలు(డగుచున్ బుట్టించు రక్షించు నం
తవిధింజేయు మునుంగ(డందు బహుభూతవ్రాతమందాత్మతం
త్ర విహారస్థితు(డై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్
దివిభంగింగొను( జిక్క(డింద్రియములన్ ద్రిప్పున్ నిబంధించుచున్.

చ.68.
జగదధినాథు(డైన హరి సంతతలీలలు నామరూపముల్
దగిలి మనోవచోగతుల( దార్కికచాతురి యెంతగల్గినన్
మిగిలి కుతుర్కవాది దగ మేరలుచేసి యెఱుంగనేర్చునే
యగణిత నర్తక్రమము నజ్ఞు(డెఱింగి నుతింపనోపునే.

ఉ.69.
ఇంచుక మాయలేక మది నెప్పుడు వాయని భక్తితోడ వ
ర్తించుచు నెవ్వడేని హరి దివ్యపదాంబుజ గంధరాశి సే
వించు నతం డెఱుంగు నరవిందభవాదులకైన దుర్లభో
దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్.

మ.70.
హరిపాదద్వయభక్తి మీవలన నిట్ల్లరూఢమై యుండునే
తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్
ధరణీదేవతలార! మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్
హరిచింతన్ మిము(జెంద వెన్న(డును జన్మాంతర్వ్యథాయోగముల్.

ప్రథమ స్కంధము 52 - 59

-:సూతుండు నారయణ కథా ప్రశంస చేయుట:-
వ.52.
అని యిట్లు మహనీయ గుణగరిష్ఠులయిన
శౌనకాదిమునిశ్రేష్ఠులడిగిన రోమమహర్షణ
పుత్రుండై యుగ్రశ్రవసుండను పేరనొప్పి
నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుందైన సూతుండు.

మ.53.
సము(డై యెవ్వ(డు ముక్తకర్మచయుడై సన్న్యాసియై యెంటి(బో
వ మహాభీతి నొహొకుమార యనుచున్ వ్యాసుండు సీరంగ వృ
క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కంజేసె మున్నట్టిభూ
తమయున్ మ్రొక్కెద బాదరాయణి( దపోధన్యాగ్రణిన్ ధీమణిన్.

సీ.
కార్యవర్గంబును గారణసంగంబు నధికరించి చరించు నాత్మతత్త్వ
మధ్యాత్మ మనుబడు నట్టి యధ్యాత్మము( దెలివి సేయగ(జాలు దీపమగుచు
సకలవేదములకు సారంశమై యసాధారణమగు ప్రభావ
రాజకంబైన పురాణమర్మంబును గాఢసంసారాంధకారపటిలి

తే.54.
దాటగోరెడి వారికి దయదలిర్పనే తపొనిధి వివరించె నేర్పడంగ
నట్టి శుకనామధేయు మహాత్మగేయు విమలవిజ్ఞాన రమణీయ వేడ్క్(గొలుతు.

క.55.
నారయణకు నరునకు, భారతికిని మ్రొక్కి వ్యాసు పదములకు సమ
స్కారము సేసి వచింతు ను, దారగ్రంథంబు దళితతనుబంధంబున్.

వచనము.56.

క.57.
గురుమతులు దపసు లంతః, కరణంబులు శుద్ధి సేయు ఘనతరభక్తిన్
హరియందు సమర్పింతురు, పరమానందమున భిన్నభవబంధనులై.

తరల.58.
పరమపూరుషు(డొక్క(డాద్యుడు పాలనోద్భవ నాశముల్
సొరిది(జేయు ముకుంద పద్మజశూలిసం జ్ఞల( బ్రాకృత
స్ఫురిత సత్వరజస్తమంబుల( బొందు నందు శుభస్థితుల్
హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్వనిరూఢు(డై.

వ.59